ప్రభువైన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బైబిల్ సీక్రెట్ వీక్షకులందరికీ మా వందనాలు.
*భూమి గుండ్రంగా లేదా గోలకారంగా ఉందని అందరికీ తెలుసు అయితే ప్రాచీన కాలంలో ఎంతోమంది ప్రజలు భూమి బల్లపరుపుగా ఉందని, దాన్ని గేదె, తాబేలు లాంటి జంతువులు లేదా చాలా బలంగల వ్యక్తి మోస్తున్నాడని నమ్మారు. కొందరేమో ఒక వ్యక్తి భూమిని పట్టుకున్నాడని మరికొందరు భూమి బల్లపరుపుగా ఉండి, భూమి చుట్టూ ఒక గోపురం ఉండి, దాని నుండి నక్షత్రాలు తీగలపై వేలాడుతున్నాయని ఇలా చాలా రకాలుగా అనుకున్నారు కానీ చివరికి భూమి గోలకారంగా ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
*చాలా కాలం క్రితం భూమి చదునుగా బల్లపరుపుగా ఉందని అనుకునేవారు ఎందుకంటే భూమి చూడడానికి నిజంగానే బల్లపరుపుగా కనిపిస్తుంది
* సముద్రం మధ్యలో మీరు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారనుకోండి నీరు చదునుగా నాలుగు దిక్కుల వ్యాపించి ఉంటుంది నీలాకాశం బోర్లించిన గిన్నెల దానిమీద చక్కగా అమరపోయినట్టు ఉంటుంది.
* భూమి బల్లపరుపుగా కనిపించినంత మాత్రాన అది బల్లపరుపుగా ఉందనుకోవడం అంత శ్రేయస్కరం కాదు
*ఆకాశమనే మహాగోళంలో భూమి అనే పెద్ద గోళం ఉంది. భూమి పెద్దగోళమే అయినప్పటికీ మనకు కనిపించే భూభాగం చాలా పెద్దది గనుక అది చదునుగా కనిపిస్తుంది.
*అయితే చాలామంది మతోన్మాదులు భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్ చెప్తుందని అంటున్నారు అసలు నిజం ఏంటి? భూమి గోళాకారంగా లేదా బల్లపరుపుగా ఉందా బైబిల్ ఏం చెప్తుంది ఆ కాలంలోని క్రైస్తవ మత పెద్దలు భూమి బల్లపరుపుగా ఉందని చెప్పడానికి కారణాలేంటి? దాని చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.
*ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోస్ గనుక నీకు నచ్చినట్లైతే, ఇంకా బైబిల్ కి సంబంధించిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. click here- Bible secretes Youtube channel
*మానవ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన పుస్తకం బైబిల్. క్రైస్తవులు మరియు అప్పటి క్రైస్తవ మత పెద్దలు బైబిల్ ని తప్పుగా అర్థం చేసుకుని వ్యక్తిగత పక్షపాతాల వల్ల భూమి చదునుగా ఉందని బైబిల్ బోధిస్తున్నదని వారు బోధించారు. అయితే వాళ్లు ఇలా అనుకోవడానికి కారణం ఏంటి మనం ఒకసారి చరిత్రలోకి వెళ్లి చూద్దాం....
*16వ శతాబ్దంలో రోమ్ లో క్యాథలిక్ చర్చ్ పూర్తి అధికారాలను కలిగి ఉండేది. బైబిల్ పై, క్రైస్తవ్యం పై సర్వ హక్కులు తమకే కలిగి ఉన్నట్టుగా బైబిల్ బోధనలు చేసే అధికారం కేవలం క్యాతోలిక్ మతపెద్దలు మాత్రమే కలిగి ఉండి ఇతరులకు బైబిల్ ని చదివే అవకాశాన్ని కల్పించేవారు కాదు. వారు చెప్పిందే వేదం. కాదన్న వారిని దైవ ద్రోహులుగా చిత్రీకరించేవారు. ఆ క్రమంలోనే జర్మన్ తత్వవేత్త ఐనటువంటి మార్టిన్ లూథర్ 1507 లో రోమన్ క్యాతోలిక్ చర్చ్ లో “బోధకుడిగా” నియమితులయ్యారు. కాని మార్టిన్ లూథర్ అందరిలా బైబిల్ ని క్యాతోలిక్ కోణంలో కాకుండా పూర్తి పరిశోధనాత్మక దృక్పధంతో చూసి , పరీశీలన చేసి, నాటి మతపెద్దలు బోధిస్తుంది తప్పు అని చెప్పాడు, బైబిల్ కి విరుద్ధంగా ఉన్న వారి అధికారాలు , బోధనలను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ చేసాడు, అలా అప్పుడు ప్రారంభమైందే ప్రొటెస్టెంట్ క్రైస్తవ్యం...
*దీనిలో భాగంగానే “95-థీసిస్” అనే రచనలు చేసి , నిత్య జీవం క్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది. రోమన్ మత పెద్దలు కేవలం దేవుని సేవకులు మాత్రమే వారు మనుషులకు దేవునికి మధ్యవర్తులుగా ప్రకటించుకుంటున్నారు ఇది అవాస్తవం అని చెప్పాడు. ఇది నాటి క్యాతోలిక్ మత పెద్దలకు మింగుడుపడని విషయం ఇలా ప్రకటిస్తే తమ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని పోప్ లియో 10 మార్టిన్ లూథర్ ని విచారణకు పిలిపించి అతని బోధనలు ఆపవల్సిందిగా ఆదేశిస్తూ అతని రచనల పై నిషేధాన్ని విధించారు. కాని మార్టిన్ లూథర్ అంతటితో ఆగకుండా బైబిల్ ని వివిధ బాషల్లోకి అనువదిస్తూ ముద్రిస్తూ అందరికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుండగా ప్రొటెస్టెంట్ క్రైస్తవ్యం విరివిగా విస్తరించాసాగింది. అందరు పరిశోధకులు, ప్రజలు బైబిల్ లోని విషయాలను తెలుసుకోసాగారు.
HP Laptop 15, 13th Gen Intel Core i5-1334U, 15.6-inch (39.6 cm), FHD, 16GB DDR4, 512GB SSD, Intel Iris Xe graphics, Backlit KB, MSO, Dual speakers (Win 11, Silver, 1.59 kg), fd0221TU
*ప్రొటెస్టెంట్ క్రైస్తవ్యం ఈ విధంగా విస్తరిస్తే తమ ఉనికికే ప్రమాదం అని ఆలోచించి 1542 లో అప్పటి పోప్ పాల్ -3 “రోమన్ అధికారిక విచారణ ప్రభుత్వాన్ని“(roman inquisition) ఏర్పాటు చేసాడు.
ఈ అధికార ప్రభుత్వ నియంతృత్వ సిద్ధాంతాలు ఏంటంటే:
>రోమన్ మతపెద్దలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు మాత్రమే సత్యం ఇవి తప్ప మరేవీ ప్రకటించిన, అనుసరించిన కఠిన శిక్షలకు పాత్రులు అవుతారు.
>ఇతర మత విదేశీయులు తమ దేశానికి రాకూడదు , వారు ఎటువంటి మత కార్యాలు జరుపరాదు.
>మాంత్రిక,ఇంద్రజాల విద్యలు అభ్యసించరాదు.
వీటికి విరుద్ధంగా ఎవరు చేసిన కారాగారంలో వేయడం లేదంటే మరణ శిక్ష విధించడం లాంటివి చేసేవారు.ఇలా ఎందఱో మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులకు మరణ శిక్షలు విధించారు.
అసలు బైబిల్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం..
*భూమి గుండ్రంగా ఉందని క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే అరిస్టాటిల్ కొన్ని పరిశోధనలతో తెలియజేసినప్పటికీ కాదు బల్లపరుపుగా ఉందని మరికొందరు శాస్త్రవేత్తలు క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు వాదిస్తూనే ఉన్నారు ఇలాంటి వాదనలు ఉన్న సమయంలో గెలీలియో అనే శాస్త్రవేత్త క్రీస్తు శకం 16వ శతాబ్దంలో అనేక ప్రయాసల చేత భూమి గుండ్రంగా ఉందని నిరూపించాడు
* గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టడం వలన మాజిలాడ్ సముద్ర యాత్రల వలన కెప్టెన్ కుక్ వంటి సాహస యాత్రికులు కొత్త ఖండాలను కనిపెట్టడం వలన చివరికి అక్టోబర్ 4,1957 భూగోళం చుట్టూ వచ్చిన ఉపగ్రహం వలన శాస్త్ర ప్రపంచానికి తెలిసిందేంటంటే భూమి బంతి వలె గుండ్రంగా గోళాకారం ఉందని కన్ఫర్మ్ అయింది.
*మన పూర్వీకులు ఎన్ని తిప్పలు పడితే గాని ఇన్ని ప్రయోగాలు చేస్తే గాని భూమి గుండ్రంగా లేదా గోళాకారంగా ఉందని అర్థం కాలేదు.
* ఏ టెలిస్కోప్ లేనప్పుడే ఏ ఉపగ్రహాలు లేనప్పుడే వేలాది సంవత్సరాల క్రితమే బైబిల్ గుండ్రంగా ఉందని చెప్పింది.
* క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితమే యోబు37:12గ్రంథంలో ఆయన వలన నడిపింప బడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద అంటూ వేల సంవత్సరాల క్రితమే వ్రాయబడింది.
* అయితే మనం ఒకటి గమనించాలి భూమి యొక్క ఆకృతి లేదా భౌతిక రూపాన్ని గూర్చి బైబిల్ ఎప్పుడు చెప్పాలని అనుకోలేదు కానీ బైబిల్ లోని అనేక రెఫరెన్స్ ల ఆధారంగా భూమి గుండ్రంగా ఉందని అర్థమవుతుంది. ఉదాహరణకు, ఆదికాండము 1లోని సృష్టి ప్రారంభంలో భూమి కేవలం నీటితో నిండి ఉందని మరియు అంతరిక్షంలో నీటి అణువుల ఉపరితల ఉద్రిక్తతల కారణంగా గోళాకార మారుతుంది ఇంకా, ఆదికాండము 1:9
"దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను".
"ఒకే చోట" భూమి & జలాలు ఉన్నాయి. నిజానికి, ఒక గోళంలో మాత్రమే ఒకే చోట భూమి మరియు జలములు కనిపిస్తాయి కాబట్టి భూమి గుండ్రంగా ఉందని దీని ద్వారా మనకు అర్థమవుతుంది
*అంతేకాకుండా ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడని యేసయ్య 40:22 లో చూడొచ్చు
భూమి గుండ్రంగా ఉందని బైబిల్ మనకు తెలియజేస్తుంది.
భూమి చదునుగా ఉందని బైబిల్ చెప్తుందని అనుకోవడానికి కారణం ఏంటి ?
*అయితే భూమి గుండ్రంగా లేదా చదునుగా ఉందని బైబిల్ బోధిస్తున్నదని చాలా మంది అనుకున్నారు. దాని కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం
*ప్రకటన గ్రంథం 7:1 లో చూసినట్లయితే
భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండగా చూచితినని వ్రాయబడింది కానీ ఇక్కడ చెప్పబడింది “భూమికి నాలుగు మూలల్లో నిలబడి ఉన్న నలుగురు దేవదూతలు” గురించి మాత్రమే. ఇక్కడ భూమి ఆకారం గూర్చి బైబిల్ చెప్పలేదు ఉదాహరణకు, ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి భూమి యొక్క నాలుగు మూలల నుండి వస్తున్న ఒలింపిక్ అట్లెట్స్ వస్తున్నారు అంటాం నాలుగు మూలలు అన్నంత మాత్రాన భూమి బల్లపరుపు ఉందని అర్థమా? కాదు కదా వారు ప్రపంచం నలుమూలల నుండి వస్తున్నారని దాని అర్థం.
*అపో.కార్యములు 1:8లో యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. అని చూస్తాం
భూదిగంతముల వరకు” అంటే, భూవ్యాప్తంగా అని దానర్థం. అంతేగానీ, భూమి బల్లపరుపుగా ఉందని లేదా దానికి హద్దులు ఉన్నాయని కాదు. అలాగే, “నాలుగు దిగంతములు” లేదా నాలుగు దిక్కులు అనే మాటలు పూర్తి భూమి గురించి చెప్తున్నాయి.
*ఇంకా కీర్తనలు 75:3లో భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అని వ్రాయబడింది ఇక్కడ దేవుడు భూమి యొక్క “స్తంభాలను” దృఢంగా ఉంచాడని చెప్తున్నాడు కానీ చాలామంది భూమి బల్లపరుపు ఉందని బైబిల్ చెప్తుందని అనుకున్నారు ఇంక బైబిల్ లో వ్రాయబడ్డ కొన్ని వాక్యాలను చూసినట్లయితే యెషయా 11:12; లూకా 13:29. ద్వితీయోపదేశకాండము 13:7; యోబు 28:24; కీర్తన 48:10; మరియు సామెతలు 30:4;
ఇవన్నీ భూమి యొక్క " నాలుగు దిక్కుల గురించి చెప్తుంది కానీ కొందరు విమర్శకులు ఇక్కడ చెప్పబడిన వాక్యాలను సరిగా అర్థం చేసుకోలేక భూమి చదునుగా లేదా బల్లపరుపుగా ఉందని బైబిల్ బోధిస్తుందని ఇది విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకమని చెప్తున్నారు.
*ఒకప్పుడు భూమి చదునుగా ఉందని సాధారణంగా విశ్వసించినప్పటికీ, సైన్స్ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికే, భూమి గోళాకారంలో ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు సాధారణ ప్రయోగాలను చేసి నిరూపించారు ఇటీవల ఎత్తైన విమానం, మన గ్రహం చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు మరియు మానవ సహిత అంతరిక్ష ప్రయాణం ద్వారా అందరికీ ఇంకా స్పష్టత వచ్చింది.
* బైబిల్ వెలుగులో భూమి ఎలా ఉందో వేల సంవత్సరాల క్రితమే రాయబడింది బైబిల్ దైవవాక్కు సత్య గ్రంధం శాస్త్రం లేనప్పుడే దాని మూలాలను తెలియజేసింది బైబిల్ గ్రంధం
*దురదృష్టవశాత్తూ, కొంతమంది క్రైస్తవ మత పెద్దల తప్పుడు బోధనలు వల్ల బైబిల్ ని తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది
*Finalగా ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి బైబిల్ సత్య గ్రంధం బైబిల్ ఎప్పుడూ తప్పుగా చెప్పదు కొందరు మతోన్మాదులు ఆ కాలంలో క్రైస్తవ బోధకులు చేసిన తప్పులకి బైబిల్ కి అంటగట్టి బైబిల్ ని తప్పని ప్రూవ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి, ఇలాంటి అర్థం లేని వాదనలతో మీ సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని లోనికి ముందుకు సాగండి తప్పుడు బోధలకు దూరంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్.
Follow us on Instagram, click hare - Instagram
click here for YouTube channel - Bible secretes Youtube channel
Click below to watch this topic as a video.. >>>> Does Bible Says the earth is flat..?
0 Comments