క్రిస్టియన్ స్త్రీ బొట్టు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా?
[Can Christians Wear a Bindi]
"
"
ప్రభువైన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ వందనాలు
ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రశ్న క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చా?పెట్టుకో కూడదా?
*అనేక మంది దైవజనులు అనేక అభిప్రాయాలు చెప్పారు కొందరు సిలువ బోట్టని దానిపై అనేక వివాదాలు నడిచ్చాయి కానీ అసలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకునే సంస్కృతి ఏక్కడిది బొట్టు పెట్టుకొని చర్చికి రావచ్చా? మారుమనస్సు పొందిన క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే ఎవరు పెట్టుకోవచ్చు? అలంకరణలో బాగంగా బొట్టు పెట్టుకోవచ్చా? క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్ఛా పెట్టుకోవద్దా అనే విషయంపై bible ఏమి బోధిస్తుందో, బొట్టు యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఇపుడు తెలుసుకుందాం.
*బొట్టు అనేది చాలా సెన్సిటివ్ మేటర్ ఈ వీడియో ద్వారా బొట్టు ఎలా వచ్చింది ఎవరు పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకోకూడదో clear గా చెప్తాం తర్వాత పెట్టుకుంటారో లేదో అనేది మీ ఇష్టం.
*ముందుగా మీకో request మా posts మీకు నచ్చినట్లైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంక future లో మంచి మంచి టాపిక్స్ ని మీ ముందుకు తీసుకొస్తాం
బొట్టు యొక్క పుట్టుక, చరిత్ర చూద్దాం [How did the concept of a bindi originate]
*బొట్టు అనేది సాధారణంగా హిందూ జైన బౌద్ధ మహిళలు నుదిటిపై ధరించే రంగు చుక్క లేదా స్టిక్కర్.ఇది తిలకంగా ప్రారంభమై, తర్వాత వివిధ మతపరమైన మరియు నుదుటిపై పెట్టుకునే ఒక అలంకరణ ప్రాముఖ్యతను పొందింది.
*భారతదేశం ఒక లౌకిక దేశం. ఈ దేశంలో భిన్న మత సంస్కృతి ఉన్నాయి ముస్లిమ్స్ వారి పద్ధతులు క్రిస్టియన్స్ వారి పద్ధతులు పాటిస్తున్నారు అయితే బొట్టు అనేది హిందూ సంప్రదాయం. బొట్టు భారతీయ సంప్రదాయం కాదు హిందూ సంప్రదాయం మాత్రమే
*బొట్టును హిందూ ఆచారాలలో ఉపయోగిస్తారు. ఇది వారి భక్తిని, విశ్వాసాన్ని సూచిస్తుందిహిందూ సాంప్రదాయంలో, బొట్టు ఎక్కవగా వారి సంస్కృతి ఆధ్యాత్మికత, వివాహ జీవితం & శృంగారానికి ప్రతీకగా వాడతారు.
*బొట్టు ప్రస్తావన హిందూ గ్రంథాల్లో పురాణాల్లో చాలా చోట్ల ఉంది. పురాణాల ప్రకారం బొట్టును నుదుటిపై ఉన్న 'ఆజ్ఞా చక్రం' లేదా 'మూడవ కన్ను' యొక్క చిహ్నంగా భావిస్తారు.
*శక్తి చక్రమైన ఆజ్ఞ చక్రము ద్వారా మనిషికి, సృష్టికి ఈ బొట్టు కేంద్ర బిందువుగా పనిచేస్తుందని ఆ శక్తి వల్ల విశ్వం పుట్టిందని కుంకుమ నోటిఫై ధరించడం ద్వారా శక్తికి కనెక్ట్ అయి ఉంటారని శివుడు & శక్తి సమ్మేళనంగా బొట్టుని హిందువులు భావిస్తారు.
*అసలు బొట్టుకి, శివుని మూడవ కన్నుకి సంబంధమేంటంటే హిందూ దేవుళ్ళలో త్రిమూర్తులు ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మది మొదటి స్థానం బ్రహ్మ సృష్టించేవాడు విష్ణువు కొనసాగించేవాడు శివుడు నాశనం చేసేవాడు అయితే మనదేశంలో అతి ఎక్కువ గుళ్ళు శివుని కుంటాయి ఎందుకంటే ఆయనే నాశనం చేసేవాడు కాబట్టి అతన్ని శాంతింపజేయాలని అతి ఎక్కువగా పూజిస్తారు.
*శివుడికి మూడవ కన్ను ఉంటుంది అది తెరిస్తే ఎవరైనా భస్మం అవుతారు హిందుత్వంలో బొట్టు మూడవ కన్నుకు సాదృశ్యం so శివుడిని శాంతింపజేయడానికి వారి ముఖ్యమైన ఆచారం ఏంటంటే బోట్టు పెట్టుకోవడం.
*శివ పార్వతులకు సంబంధించి ఇంకొక స్టోరీ కూడా చెప్తారు ఒక రోజు శివుని పార్వతి అడిగిందంట స్త్రీ వైద్యవ్యం పొందకుండా తన భర్త చిరకాలం బ్రతకాలంటే ఏం చేయాలనీ, అప్పుడు భర్త క్షేమం కోసం స్త్రీ రోజు స్నానం చేశాక ఐదు చోట్ల బొట్టు పెట్టుకోవాలని శివుడు చెప్పాడంట 1st place పాపిట్లో, 2nd కనురెప్పల మధ్య, 3rd అంగటి దగ్గర, 4th చాతి దగ్గర, 5th బొడ్డు దగ్గర బొట్టు పెట్టుకుంటే దీర్ఘాయుష్ ఉంటుందని చెప్పాడంట
*అంతేకాదు శివ పార్వతులు ఆదిదంపతులు వారిద్దరిని కొలవడానికి లింగాన్ని కొలుస్తారు శివలింగం అనేది శివుడు పార్వతి కలయిక దాని జీవం వస్తుందని అది కాపాడుతుందని వారి నమ్మకం కాబట్టి పెళ్లి కాని వారు నాకు మంచి భర్తని ఇవ్వు అని బొట్టు పెట్టుకుంటారు
*ముఖ్యంగా పెళ్లి అయిన స్త్రీలు వాళ్ళ మాంగల్యాన్ని కాపాడమని భర్తల దీర్ఘాయువు కోసం శివున్ని మూడవ కన్ను తెలవకూడాదని బొట్టు పెట్టుకుంటారు.
*తాళిబొట్టు అంటే అవి రెండు శివలింగాలకు సాదృశ్యంగా వేసుకుంటారంట మాంగల్యం కాపాడడం అంటే అదే. ఒకవేళ భర్త చనిపోతే బొట్టు తీసేస్తారు అలాంటి సిచువేషన్ రావద్దంటే బొట్టు పెట్టుకోమని చెప్పాడు అలా బొట్టు గురించి హిందూ ధర్మం మూలాలు ఉన్నాయి
*బొట్టును అందరూ ఒకేలా పెట్టుకోరు బొట్టు పెట్టుకునే విధానం కూడా different గా ఉంటుంది బొట్టును మధ్య వేలుతో పెడితే ఆయువు పెరుగుతుందని, ఉంగరపు వేలితో పెడితే శాంతి చేకూరుతుందని, బ్రొటనవేలుతో పెడితే ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారని, చూపుడు వేలుతో పెడితే ముక్తి కలుగుతుందని భావీస్తారు.
*ఇక ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి కారణం కనురెప్పల మధ్య ఉంది బ్రహ్మ ప్లేస్, బ్రహ్మరంగు ఎరుపు రంగు కాబట్టి నేను బ్రహ్మను పూజిస్తున్నానని చెప్పడానికి ఎక్కువ ఎర్రని రంగు బొట్టు పెట్టుకుంటారు
బొట్టు పెట్టుకుంటే బ్రహ్మ భక్తులమని ఆదిపరాశక్తి జగన్మాతను పూజిస్తున్నానమని మమ్ములను మీకు అర్పిస్తున్నామని అర్థం
*బొట్టును సాంప్రదాయకంగా కుంకుమ, విభూది, చందనం వంటి సహజ పదార్థాలతో తయారు చేస్తారు.
*పురాణాల ప్రకారం ప్రారంభంలో బొట్టు త్రిమూర్తులు, శక్తి మాత మీద భక్తి ప్రదర్శనగా ఉన్నప్పటికీ, కాలక్రమేణా వివిధ సంప్రదాయాలు, విశ్వాసాలు కలిసి భిన్న దేవతా సంప్రదాయాలకు అనుగుణంగా అనేక రకాల బొట్లు & బొట్టు ధరించే విధానాలు మారాయి.
*బొట్టు అనేది ముక్కోటి దేవతలను పూజిస్తున్నామనే దానికి నిదర్శనంగా కూడా స్త్రీ పురుషులు పెట్టుకుంటున్నారు
*కాబట్టి మెయిన్ గా బొట్టు పెట్టుకునేది హిందువులు అనే దానికి సూచనగా నేను శివుని నమ్ముతాను అతడు నన్ను నా మాంగల్యాన్ని కాపాడుతాడని, లేదా విష్ణుని నమ్ముతాను అయ్యప్ప స్వామిని లేదా హనుమంతుడిని లేదా శక్తి మాతను నమ్ముతా ఇలా ఒక దేవునికి నిదర్శనంగా భక్తితో నమ్మకంతో బొట్టు పెట్టుకుంటారు అది వారి కట్టుబాట్లు వారి గ్రంథాల్లో ఉంది కాబట్టి వారు పెట్టుకుంటున్నారు ఒకవేళ నమ్మకం లేకపోతే బొట్టు తీసేస్తారు.
*బొట్టు పెట్టుకోవడం వెనుక సైంటిఫిక్ గా రీసన్ ఉందని చాలామంది నమ్ముతారు. కనుల మధ్య కాన్సన్ట్రేషన్ చేసి మెడిటేషన్ చేస్తే సూపర్ నాచురల్ పవర్ పొందుకుంటారని నమ్ముతారు అక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల శక్తి చక్రం ఉత్తేజితం అయ్యి ఏకాగ్రతను పెంచుతుందని మానసిక ప్రశాంతతను కలుగుతుందని, మెదడు చురుగ్గా మారి సోమరితనం నశిస్తుందని నమ్ముతారు. బట్ సైంటిఫిక్ గా ఇది prove అవలేదు బొట్టు పెట్టుకోవడం వారి సాంప్రదాయం, నమ్మకం, వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇది హిందూ గ్రంధాల్లోని బొట్టు పుట్టుక...
బొట్టు చరిత్రను చూస్తే: [History of Bindi]
*సింధు నాగరికత టైంలో ఈ బొట్టు ని వివాహానికి సూచనగా పెట్టుకునేవారు పెళ్లి కానీ ఆడపిల్లలు దీపాల మాసిని లేదా భష్మాన్ని తీసుకొని నల్ల బొట్టు పెట్టుకునేవారు
*పురాతన గ్రంథాలలో బొట్టు ప్రస్తావనలు ఉన్నాయి. కాలక్రమేణా, బొట్టు యొక్క శైలి మరియు ప్రాముఖ్యత మారుతూ వచ్చింది. బొట్టు అనేది కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు, ఇది హిందూ సంస్కృతి, సంప్రదాయాం మరియు విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది.
*బొట్టు పెట్టుకునే చాలామందికి ఎందుకు బొట్టు పెట్టుకోవాలో కూడా అవగాహన లేదు కానీ నోదిటిపై కుంకుమ ధరిస్తే భర్త ఆయుష్షు పెరుగుతుందని, లక్ష్మీ నివాసం చేస్తుందని దానివల్ల అన్ని శుభాలు జరుగుతాయని హిందువుల నమ్మకం కొందరు దీనిని వివాహానికి చిహ్నంగా, మరికొందరు స్త్రీ శక్తికి సూచనగ చూస్తారు.
*ప్రాచీన కాలంలో పెళ్లిలో చందనం, కుంకుమ పువ్వు కలిపి బొట్టు పెట్టుకునేవారు పెళ్లి తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటే వారికి పెళ్లయిందని అర్థం సమాజంలో వివాహిత అని గౌరవంగా చూసేవారు అలాగే భర్త చనిపోతే స్త్రీ అలంకరణ చేసుకోవద్దని బొట్టు గాజులు తీసేసేవారు
*అలా ఆమెను విదవ అని బొట్టు చూసి గుర్తించేవారు ఇంకా సమాజంలో వారిని అంటరాని వారిగా అశుభంగా భావించేవారు ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికి వారిని పిలిచేవారు కాదు
*ఆ తర్వాత కాలంలో అనేకమైన సంఘసంస్కర్తలు బొట్టు గురించి సతీ అనే మూఢాచారానికి వ్యతిరేకంగా పోరాడారని చరిత్ర చెబుతుంది
*ఈ పద్ధతులను పురాతన భారత సింధు నాగరికత ప్రాంతం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక &చైనాలోని కొన్ని ప్రాంతాలు కూడా అవలంబించేవి. ఎందుకంటే ఈ బొట్టు కేవలం హిందుత్వంలోనే కాదు జైనిజం బుద్ధిజంలో కూడా పాటించేవారు
*ఇంకా బుద్ధిష్టులు జైనులు అయితే బొట్టు ద్వారా బుద్ధుడి జ్ఞానం వారిలో ప్రవహిస్తుందని నమ్ముతారు
↪బొట్టు భారతీయ సాంప్రదాయం అని చాలా మంది వాదిస్తారు. భారతీయ సాంప్రదాయం అయితే కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా అందరూ పాటించాలి. కానీ చాలా ప్రాంతాలలో, చాలా సంప్రదయాలలో ఈ బొట్టు పెట్టరు. కేవలం హిందూ, బౌద్ధ మతస్థులే పెడతారు మనం బొట్టు చారిత్ర పూర్తిగా తెలుసుకుంటే అర్ధమవుతుంది బొట్టు భారతీయ సంప్రదాయం కాదు. అది పూర్తిగా భారత హిందూ సంప్రదాయం అని ఇది బొట్టుకు సంబంధించిన పుట్టుక చరిత్ర.
క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే అది పాపమా? బైబిల్ ఏం చెప్తుంది?
*బొట్టు గురించి బైబిల్ చెప్పలేదు పెట్టుకుంటే తప్పేంటి అని చాలామంది అంటారు క్రైస్తవుల్లో కూడా బొట్టు పెట్టుకున్న ప్రాబ్లం లేదని కొన్ని బోధలు మొదలయాయి అయితే బొట్టు గురించి particularగా బైబిల్లో వ్రాయబడలేదు. కానీ బొట్టుకు సంబంధించిన మూలాలు హిందూ గ్రంధాల్లో విగ్రహారాధనతో ముడిపడి ఉన్నాయి కాబట్టి అలాంటి విగ్రహారాదనకి సంబంధించిన దాన్ని అన్యజనుల ఆచారాలను క్రైస్తవులు పాటించకూడదని బైబిల్ చెప్తుంది బొట్టు అన్య ఆచారం అది ఒక మతమునకు చెందినప్పుడు దాన్ని అనుసరించడం బైబిల్ కి వ్యతిరేకం అని చెప్పక తప్పదు.
*బొట్టు పెట్టుకోవడాన్ని ఎంతో గర్వంగా హిందువులు బావిస్తారు. హిందూసాంప్రదాయంలో ముత్తైదువుకి ఎంతో ప్రాదాన్యం ఉంది ఇదివరకు భర్త చనిపోయిన స్త్రీ ఇక బొట్టు పెట్టకూడదు అని బొట్టు తుడిచివేసే వారు. బొట్టు లేని స్త్రీ తెల్లచీరతో కనిపిస్తే చాలు భర్త చనిపోయినట్టుగా అర్ధం చేసుకునేవారు
*అయితే ఇది క్రైస్తవ సాంప్రధాయములో లేదు. బైబిల్ కూడా దీనిని వివరించుట లేదు. పూర్తిగా హైందవ సాంప్రధాయము.
*అయితే ఇప్పుడు పెళ్లి కానివారు, పెళ్లయిన వారు కూడా ఒక మతానికి ఆచారానికి గుర్తుగా పెట్టుకుంటున్నారు
*బైబిల్ స్పష్టంగా చెప్పింది అన్యజనుల ఆచరాలు పాటించకండి అని so బొట్టు విగ్రహారాధనకు సంబంధించినవి. విగ్రహారాధనకు ఏసుకు సంబంధం లేదు కాబట్టి సంపూర్ణంగా క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు బొట్టు పెట్టుకోవడం correct కాదు. క్రైస్తవులయ్యాక అన్య దేవతల మీద ఆమెకి నమ్మకం లేదు కాబట్టి బొట్టు తీసేస్తారు
*నిజమైన క్రైస్తవులు ఎవరంటే మేము పాపులం అని ఒప్పుకొని ఆయన నిజమైన దేవుడని నమ్మి బాప్తిస్మము పొంది బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మేము లోకంలో శిలువ వేయబడి ఇక జీవించు వారం మేము కాదు మా యందు జీవించేది క్రీస్తే అని ఆలోచన కలిగిన వారు.
*బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం కాబట్టి క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత వదిలేయడం మంచిది అయితే మీ ఇంట్లో అభ్యంతరం ఉంటే బొట్టును కొనసాగిస్తూనే కుటుంబ సభ్యుల అర్థం చేసుకున్నట్లు ప్రార్థించండి త్వరలో మీ కుటుంబ సభ్యుల హృదయాన్ని దేవుడు మారుస్తాడు అయితే బ్రతుకు మార్చుకోకుండా బొట్టు తీసేసిన ఏమి ఉపయోగం ఉండదు. దేవుడు పై వేషమును చూడడు.
బొట్టు పెట్టుకుని చర్చికి రావచ్చా?
*దేవున్ని సంపూర్ణంగా తెలుసుకున్న వారు లోక సంబంధమైన ఆచారాలను పాటించరు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు అన్యులు కూడా చర్చికి వస్తారు, క్రైస్తవం ఎలా ఉంటుందో తెలుసుకుందామని కొందరు, రోగాలు పోవాలని కొందరు, మంచి జరగాలని ఇంకొందరు వస్తారు బొట్టు పెట్టుకొనే చర్చికి రావడం మొదలుపెడతారు.
*అలాంటప్పుడు బొట్టు పెట్టుకొని చర్చి కి వస్తే తప్పు కాదు ఎందుకంటే వారికి దేవుని గురించి bible గురించి అంతగా తెలీదు
*అయితే అలాంటి వారు చర్చికి వచ్చినపుడు కొందరు పాస్టర్స్ మీరు బొట్టు పెట్టుకోవద్దు బంగారం పెట్టువేసుకోవద్దు తెల్లచీర కట్టుకోవాలి అని చెప్తున్నారు దానివల్ల అన్యులు or అపుడే చర్చికి వస్తున్నవారు ఆ మాటలు విని అన్ని తీసేయాలేమో తీసేస్తే పక్కవాళ్ళు ఎం అనుకుంటారో అని కొందరు, అన్ని తీసేయడం వల్ల భర్తలు చర్చికి రానివ్వక ఇంకొందరు దేవునికి దూరం అవుతున్నారు.
*అలాగే ఇంట్లో force వల్ల బోట్టు పెట్టుకునే విశ్వాసులను బొట్టు తీసేయమని మంగళసూత్రం బంగారం తీసేయాలంటూ, సేవకులుగాని తోటి విశ్వాసులు గాని force చేసి వారు యేసు ప్రేమను తెలుసుకోకుండా వెళ్ళిపోయేలా చేయొద్దు.
*మొదట యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాక వారే అన్ని అర్ధం చేసుకొని అన్య ఆచారాలని follow అవ్వడం మానేస్తారు ఇది వివిధ సంస్కృతులలోని ప్రజలకు దేవుని పరిచయం చేసే పద్ధతిలో భాగం. ఇలాగే మెత్తటిస్టులు కొన్ని వందల కుటుంబాలని ప్రభువు దగ్గరికి నడిపించారు.
*అలాగని వారు బొట్టు పెట్టుకోవచ్చు అని మా ఉద్దేశం కాదు వారు దేవునిలో ఎదిగే వరకు పెట్టుకొనివ్వండి తర్వాత బైబిల్ ని పూర్తిగా తెలుసుకున్నాక వారే తీసేస్తారు
*చర్చికి వచ్చే వారికి దేవుని ప్రేమను బైబిల్ సారాన్ని చెప్పండి యేసు త్యాగం తెలుసుకున్నప్పుడు ఏసుకు విగ్రహారాధనకు సంబంధం లేదని చెప్పినప్పుడు వారి కుటుంబ పరిస్థితులను చూసుకొని ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి వారే తీసేస్తారు
*అంతేగాని చర్చికి వచ్చిన వారికి ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పడం వల్ల చాలా మంది దేవునికి దూరం అవుతున్నారు.
*నిజమైన క్రైస్తవులు ఎవరంటే పాపులం అని ఒప్పుకొని ఆయన నిజమైన దేవుడని నమ్మి బాప్తిస్మము పొంది బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మేము లోకంలో శిలువ వేయబడి ఇక జీవించు వారం మేము కాదు మా యందు జీవించేది క్రీస్తే అని ఆలోచన కలిగిన వారు. ఇలాంటి క్రైస్తవులకి ఇది చేయు అది చేయకూడదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారు డైలీ బైబిల్ చదువుతారు కాబట్టి ఏది చేయాలో ఏది చేయొద్దు వారికి అనుభవ పూర్వకంగా ఎరిగి ఫాలో అవుతారు
ఒకవేళ బొట్టు పెట్టుకోవాల్సి వస్తే ఎవరు పెట్టుకోవచ్చు?
*చాలామంది మీకు నచ్చితే పెట్టుకోండి అంటున్నారు కానీ బైబిల్లో పెట్టుకోవాలని లేదు కాబట్టి పెట్టుకోవద్దు అయితే ఆ బొట్టు కోసం మీ హస్బెండ్ or ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే అప్పుడు పెట్టుకోండి but అలా అని నాకు చాలా నచ్చిందని పెట్టుకోవద్దు
*మనం బొట్టు పెట్టుకోవడం వెనుక కారణం ముఖ్యం
*కొందరు నేను క్రైస్తవురాలిన అని అందరికీ తెలుస్తుందని పెట్టుకుంటారు అది తప్పు 1పేతురు4:16లో దేవుని కోసం సిగ్గుపడక ఆయన నామాన్ని బట్టి మహిమ పరచాలని వ్రాయబడింది మన దేశంలో క్రైస్తవులు మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు బొట్టు పెట్టుకుంటే maximum నిన్ను క్రిస్టియన్ అని ఎవరు అనుకోరు క్రైస్తవులమని ఎవరికీ తెలువద్దని బొట్టు పెట్టుకుంటే అది పాపం అవుతుంది.
*ఇంతకీ బొట్టు ఎవరు, ఎలాంటి పరిస్థితుల్లో పెట్టుకోవాలని చెప్తున్నానో మీకు అర్ధమౌతుందా?
*కొందరు వారి ఇష్టంతో కాకుండా ఇంట్లో పరిస్థితులను బట్టి పెట్టుకుంటారు అలాంటప్పుడు బొట్టు పెట్టుకుంటే క్రైస్తవులే కాదని చెప్పడం తప్పు
*కొత్తగా చర్చ్ కీ వచ్చినవారు క్రీస్తును నమ్ముకోగానే బొట్టు తీసేయడం వల్ల అన్యజనులుగా ఉన్న భర్త అత్తమామలు అమెను వేధించడం సంసారంలో కల్తలు రావడం జరుగుతాయి
*ఒకవేళ ఇంట్లో నువ్వు ఒకదానివే మారవు భర్త మారలేదు ఎవరు మారలేదు అలాంటప్పుడు నువ్వు బొట్టు తీసేస్తే భర్త నేను చనిపోయానని తీసేసావా అని వాదిస్తుంటే ఆయన ఆ belief systemలో ఉన్నాడు కాబట్టి మీ భర్తకు అర్థమయ్యేలా చెప్పండి ఒప్పుకుంటారు లేదంటే అతడు మారేవరకు పెట్టుకొండి
*ని ఇంట్లో పరిస్థితిని బట్టి పెట్టుకుంటే ని పరిస్థితిని దేవుడు చూస్తాడు కాబట్టి అలాంటపుడు పెట్టుకోండి తప్పులేదు
*కొందరు శివుడిని నమ్మేవారు ఉన్నారు వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకొని మీలో కొందరు యేసుని నమ్మారు బట్ ఇంట్లో సమాజంలో ఇబ్బందుల వల్ల పెట్టుకుంటున్నారు suddenగా దేవుడు వచ్చిన నీవు బొట్టు పెట్టుకున్నావు కాబట్టి నరకానికి పో అనడు అలాగని బొట్టు పెట్టుకో అని మా ఉద్దేశం కాదు నువ్వు ఏ పరిస్థితిలో పెట్టుకున్నావో ఆయనకు తెలుసు so నీ విశ్వాసం పెరిగే వరకు పెట్టుకో తర్వాత నువ్వే తీసేస్తావు
*మీ భర్త లిప్స్టిక్ పెట్టుకో కాటుక పెట్టుకో అంటే అలాంటప్పుడు అతని కోసం పెట్టుకోవచ్చు అతను రక్షణలోకి వచ్చక ఇవన్నీ మనకు వద్దంటాడు మనకు ఆత్మీయ అలంకరన చాలంటాడు. అంతేకానీ పాస్టర్ చెప్పాడని నీ అభిప్రాయాలని జోడిస్తూ మీ హస్బెండ్ కి చెప్పి పాస్టర్స్ మీద కోపం పెరిగేలా చేయకండి
*ఎవరైనా చర్చికి వస్తే దేవుని గూర్చి bible గూర్చి చెప్పినపుడు వారు బైబిల్ చదివి ఇవన్నీ ఆచారాలు, ఏసుకు విగ్రహారాధనకు అసలు సంబంధం లేదు అని అర్థం చేసుకుంటే విగ్రహారాధనకు సంబంధించిన చాలా పద్ధతులు వారు స్వచ్చందంగా విడిచిపెడతారు
*ఎవరైనా వారిని ఎందుకు విడిచిపెట్టారంటే వారే ఇతరులకు సమాధానం చెప్తారు అదే పాస్టర్స్ చెప్తే తీసేస్తే ఆ పాస్టర్ వద్దన్నాడు అందుకే తీసేసాను అని చెప్తారు అంతేకానీ ఎందుకు తీసేస్తున్నారు వారు చెప్పలేరు
*సమాజం కోసం ఉంచుకున్న సరే వచ్చిన నష్టమేమీ లేదు వారు సత్యం గ్రహించి వారు కొన్ని అలవాట్లు మానుకుంటున్నారు అంటే వారు పరిపూర్ణతలోకి వచ్చారని అర్థం అలా కాకుండా మనమే వాటిని తీసేయ్ తీసేయ్ అని చెప్తే తీసేస్తే వారు ఎలా పరిపూర్ణులు అవుతారు. ఎవర్ని పెట్టుకోమని లేద తీసేయమని బలవంతం చేయకూడదు bible వారికి అర్థమైతే స్వతహాగా వారే తీసేస్తారు
విగ్రహ సంబంధ సిద్ధాంతాలతో కాకుండా పెళ్లి జరిగిందని అనడానికి గుర్తుగా బొట్టు పెట్టుకోవచ్ఛా?
*ఈ రోజుల్లో బొట్టు పెట్టుకుంటున్న క్రైస్తవులు విగ్రహ సంబంధ సిద్ధాంతాలతో బొట్టు పెట్టుకోవట్లేదు
*బొట్టు మంగళసూత్రం ధరించడం ప్రస్తుతం ఎలా మారింది అంటే అన్య సిద్ధాంత పర గుర్తులుగా కాకుండ నాకు పెళ్లయింది భర్త బ్రతుకె ఉన్నాడని చెప్పే ఐడెంటిఫికేషన్ మార్క్స్ గా మారాయి అంటున్నారు కాని బొట్టు చూసి వీరికి పెళ్లి అయ్యింది or కాలేదని చెప్పరు పురాతన కాలంలో అలా బావించే వారు but ఇప్పుడు చిన్నవారు పెద్దవారు పెళ్ళైనవారు పెళ్లికానివారు పురుషులు శ్రీలు అందరు బొట్టు పెట్టుకుంటున్నారు బొట్టు అనేది ఈ కాలంలో మేము హిందులం అని చెప్పడానికి పెట్టుకుంటారు బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూడగానే మనకు అర్ధం అవుతుంది వాళ్ళు హిందులని *బొట్టు అనేది అన్య సిద్ధాంతం కాబట్టి క్రైస్తవులు బొట్టు పెట్టుకోవద్దు అని చెప్తున్నారు ఇది నిజమే అవన్నీ అన్య ఆచారాలు ఒక క్రైస్తవుడు అన్నీ ఆచారాలు పాటించకూడదు
*అయితే కొందరు వారి ఇష్టంతో కాకుండా ఇంట్లో పరిస్థితులను బట్టి పెట్టుకుంటారు అలాంటప్పుడు బొట్టు పెట్టుకుంటే క్రైస్తవులే కాదని చెప్పడం తప్పు
*ని ఇంట్లో పరిస్థితిని బట్టి పెట్టుకుంటే ని పరిస్థితిని దేవుడు చూస్తాడు కాబట్టి అలాంటపుడు పెట్టుకోండి ఇక మంగళసూత్రం గురించి అది వేసుకోవాలో లేదో separate గా video చేస్తాం.
*బొట్టు గురించి వారి గ్రంథాల్లో ఉన్నాయి, హిందూ సంప్రదాయం కాబట్టి వద్దంటున్నారు కదా మరి చీర గురించి కూడా వారి గ్రంథాల్లో ఉంది అంటే మీరు చీర కట్టుకోవడం మానేస్తారా అంటున్నారు కాని చీర కట్టుకున్నట్టు ఉండి తప్ప చీరకు విగ్రహారాధనకు సంబంధం లేదు వాళ్ళు చీరా కట్టుకున్నట్టు ఉన్నంత మాత్రాన మనం కట్టుకోవద్దు అంటే అలా అయితే వాళ్ళు rice vegetables తిన్నారు కాబట్టి మనం తినొద్దు వాళ్ళు వ్యవసాయం చేసారు కాబట్టి మనం చేయొద్దు అంటే అది ముర్కత్వమే అవుతుంది so వాళ్ళు చేసారని కాకుండా వాటి మూలాలు విగ్రహారాధనకు సంబంధం ఉంటే మాత్రం క్రిస్తవులు వాటిని follow అవ్వకూడదు.
*మత్తయి15:6లో మీ పారంపర్య ఆచారాల నిమిత్తం దేవుని వాక్యం నిరార్ధకం చేయుచున్నారని రాయబడింది
*క్రిస్టియన్స్ గా ఉంటూ హిందూ పద్ధతులు పాటించే పని లేదు
ఇంకొందరు అడుగుతారు అన్ని పెట్టుకోవచ్చు కానీ బొట్టు మాత్రం ఎందుకు పెట్టుకోవద్దని?
*అయితే మిగిలినవి బంగారు ఆభరణాలు పెట్టుకుంటే పాపం కాదు but ఏది వేసుకున్న limitsలో పెట్టుకోవాలి
*నిర్గమకాండ 3:22లో చూస్తే దేవుడు ఐగుప్తు దగ్గరే ఆభరణాలు తీసుకోండి వారు మీ శ్రమను దోచుకున్నారు అని చెప్తాడు ఈ బంగారం తీసుకెళ్లి మీ కుమారులకు వెయ్యమని చెప్తాడు. బైబిల్ ప్రకారంగా కూడా రేపు మనం బంగారు వీధుల్లో నడుస్తాం బొట్టు విగ్రహారాధనతో ముడిపడి ఉంది but బంగారం గూర్చి అలా లేదు బైబిల్లో చాలా చోట్ల బంగారాన్ని దేవుని పిల్లలకి ఇచ్చినట్టు ఉంటుంది
* బైబిల్లో బొట్టు గురించి లేదు. కాని పాత నిబంధనలో కమ్మీలు, గాజులు వేసుకున్నట్టు ఉంది
*బంగారం పెట్టుకున్నట్టు ఉంది కదా అని అందరికీ చూపించుకోవడానికి పెట్టుకోవద్దు limitలో ఉండి simpleగా తగినంత పెట్టుకుంటే పాపం కాదు but అందరికి చూపియాలని జిగేల్ జిగేల్ మంటూ కనబడకూడదు క్రైస్తవులు మృదువైనట్టు సాధువైనట్టు మాత్రమే ధరించాలి అని పౌలు గారు చెప్పారు. లేదు లోక సంబంధమైనవి ఇవేవీ వద్దు నేను సింపుల్ గా ఉంటాను అంటే ఇంకా మంచిది దైవ లక్షణాలు నీలో కనబడాలి
బొట్టుని అలంకరణ కోసం పెట్టుకోవచ్చా?
*బొట్టు వెనుక మతపరమైన సింబల్స్ ఉంటే పెట్టుకోవద్దు. ఎవరో దేవుళ్లని తలుచుకుని వారి మీద ఆరాధన భావంతో లేదా సింబాలిక్ గా పెట్టుకోవద్దు అలంకరణ వరకు అయితే మీ మీ వ్యక్తిగతం అని కొందరు చెప్తారు
*కానీ నాకు తెలిసినంతవరకు బొట్టు గాజులు కేవలం అలంకారణే కాదు అవి హిందు మత సాంప్రదాయంలో భాగం. దాని మూలం విగ్రహారాధనతో ముడిపడి ఉంది బొట్టు భారత దేశంలో స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా పెట్టుకుంటారు. ఒక వ్యక్తి ధరించే బొట్టు అతను ఏ దేవుడ్నీ ఆరాధిస్తున్నాడో చూపిస్తుంది. ఉదాహరణకు శైవులు , వైష్ణవులు వేరు వేరు నామాలు ధరిస్తారు. కాళికాదేవిని ఆరాదించే వారు ఎర్రని కుంకుమ బొట్టును నుదుట ధరిస్టారు. అంటే ఒక వ్యక్తి ఏ మతానికి చెందినవాడో అతను ధరించిన బొట్టు చూసి చెప్పవచ్చు. బొట్టు అనేది హిందువులు అలంకరణ అర్థం కాదు భక్తితో పెట్టుకుంటారు
*బొట్టు అనేది ఎవరిని ఆరాధించేవారు వారి ఆరాధ్య దైవానికి సంబంధించిన బొట్టు పెట్టుకుంటారు ముక్కోటి దేవతలను పూజిస్తున్నామని సూచనగా బొట్టు పెట్టుకుంటారు వీటన్నింటిలో విగ్రహారాధనకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. బొట్టు ఎలా తయారు చేయాలో కూడా వారి గ్రంథంలో ఉన్నాయి
*బొట్టు అనేది హిందూ మత సాంప్రదాయంలోనిది ఆ మతాన్ని వదిలి క్రీస్తును అంగీకరించినప్పుడు మరి ఆ మత సంప్రదాయాన్ని ఎలా అనుసరిస్తారు
*క్రైస్తవ స్త్రీలలో కొందరు గాజులు రింగ్స్ బంగారం ధరిస్తున్నారు, కొందరు తక్కువగా పెట్టు కొనుచున్నారు, ఇంకొందరు ఎక్కువగా పెట్టు కొనుచున్నారు, కొంతమంది అసలు ఆభరణాలు అసలు ధరించట్లేదు, అందువల్ల ఈ విషయంలో అది వ్యక్తి గతమే గాని ఎవరి బలవంతం ఉండదు
*ఇక అలంకరణ గురించి మనం బైబిల్ ప్రకారంగా చూస్తే క్రైస్తవులు మృదువైనట్టు సాధువైనట్టు మాత్రమే ధరించాలి బాహ్య అలంకరణ కన్నా అంతరంగిక అలంకరణ చాలా ప్రాముఖ్యం అని, స్త్రీకి అణుకువే అసలైన అలంకరణ అని బైబిల్ చెబుతుంది.
*మానవ పద్ధతులు, ఆచారాలు దైవ భక్తికి తగినట్లుగా ఉంటే సరిపోతుంది.
*1 Peter(మొదటి పేతురు) 3:1-5 చుస్తే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; 3.జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, 4.సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
*1Timothy2:9,10 స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అని ఉంది
*కాబట్టి ఒక వ్యక్తి క్రైస్టవునిగా మారితే, తాను క్రైస్తవుడినని ఇతరులు గుర్టించెలా ఉండాలి. *ద్వితీయొపదేశకాండం 6:4–9 వరకు చుస్తే:
ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.
*నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను. అని ఉంది
*అంటే, దేవుడిని ఆరాధించే వాళ్లు అన్ని విషయాల్లో, మాటల్లో, చేతల్లో, వాళ్లు ఇతరులకు కనబడే విధానంలో కూడా క్రిస్తవులు అని తెలిసేలా ఉండాలి. ఒక క్రైస్తవుడు బొట్టు పెట్టుకుంటే అతను వెరే మతస్తుడని ఇతరులు అనుకుంటారు.
*ఎఫెసి. 4:17లో "కాబట్టి ప్రభువు పేరున నేను మీకు చెప్పేది, మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, మీరిక అన్యజనుల్లా అర్థంపర్థంలేని ఆలోచనల ప్రకారం నడుచుకోకండి." - అంటే క్రైస్తవుడనని చెప్పుకుంటూ, వెరే మతానికి చెందిన వాడిగా కనపడాలనుకోవడం so అలాంటి అన్య పద్ధతులు పాటించొద్దని చెప్తున్నాడు.
ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు బొట్టుపెట్టడం తప్పా? ఒప్పా?
"వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను,ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుస రించుచు, వ్యర్థులైవారి వాడుకలచొప్పున మీరు చేయ కూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి." (2 Kings 17:15) ఉంది.
"అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును"(సామెతలు 31:30)
దేవుని యందు ప్రియులైనవారు లారా...
వ్యర్ధమైన వాటి యందు మనస్సు పెట్టక, హైందవ సంప్రదాయాలు ఆచరింపక, దేవుని యందు మనస్సు యుంచుము.
*ఓ అక్కా ఓ చెల్లి నీవు క్రీస్తును నమ్మి రక్షకునిగా విశ్వసిస్తూ ఇంకా బొట్టు ఫ్యాషన్ గా పెట్టుకుని తిరుగుతుంటే ఎందుకు పెట్టుకోవాలి అని ఒక్కసారి నీ మనసాక్షిని అడుగు.
బొట్టు తీసేసి నేను క్రీష్టియన్ అని గర్వించే అక్కా చెల్లి కేవలం బొట్టు మాత్రమే తీసి వేసి అతిసయపడకు.
దేవుని హృదయంలో ఆయన నిన్ను వేటితో అలంకరించాలని ఆశపడుతున్నాడో గ్రహించు.
నేడు బొట్టు తీసివేసి ఫ్యాషన్ అనే వారికి మీకు తేడా ఏమి కనిపించడంలేదు.
*అన్యజనుల ఆచారంతో పాలివారు కాకుండా వ్యర్ధమైన వాటిపై మనస్సు నిలపకపోవడం ఆశీర్వాదం
*కానీ సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు లేవీకాండం18:3లో మీరు ఐగుప్తు కానాను దేశాచారాముల చొప్పున చేయకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు నా కట్టడలు విధులు ఆచరించి నడుచుకొనేవాడు బ్రతుకునని యెహోవా చెప్తున్నాడు ఇర్మియ పది రెండులో అన్యజనుల ఆచారములు అభ్యసించి రాదని దినమున ఆచారములు వ్యర్థములను ఉంది దీన్ని బట్టి నూతనంగా జన్మించి క్రీస్తును అంగీకరించిన స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా లేదా మీరే గ్రహించాలి సిలువబట్టు మరి ఏదో బొట్టు అని మనుషుల మాటలకు దయచేసి మోసపోకండి బైబిల్ ప్రకారంగా జీవించే కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమెన్.
God bless you
Subscribe to my YouTube channel; www.youtube.com/@biblesecretstelugu
Follow us on instagram for more content: instagram.com/bible.secrets?utm_source=qr&r=nametag
Thank you and visit again
0 Comments