The first Bible to be taken to the moonThe first Bible to be taken to the moon || చంద్రుడిపైకి తీసుకెళ్లినా మొట్టమొదటి బైబిల్🔺..
@మహోన్నతుడైన మన దేవుడును లోక రక్షకుడైన ఏసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో బైబిల్ సీక్రెట్ వీక్షకులందరికీ మా వందనాలు.
🔻భూమిపైనే కాదు అంతరిక్షంలోని చంద్రుడి పైకి తీసుకెళ్లి చదవబడిన, మొట్టమొదటి గ్రంధం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ మాత్రమే అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది..
@అలాంటి బైబిల్ కి సంబంధించిన అనేక విషయాలను మీ ముందుకు తీసుకురాబోతున్న0..
@ ఈ వీడియో ద్వారా ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే అలాంటి బైబిల్ ని మొట్టమొదటి సారీ చంద్రుడి పైకి తీసుకెళ్లారు
అసలు బైబిల్ గ్రంధాన్ని చంద్రుని మీదికి ఎవరు, ఎందుకు, ఎలా తీసుకెళ్లారో ఇప్పుడు చూద్దాం.
@1967లో అపోలో11 మిషన్ టైంలో Astronauts ఎడ్వర్డ్ వైట్ II గారు ఒక విలేఖరితోమాట్లాడుతూ, చంద్రునిపైకి బైబిల్‌ను తీసుకువెళ్లాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. తర్వాత కొద్ది రోజులకే ఆయన చనిపోయారు ఎడ్వర్డ్ గారి జ్ఞాపకార్థం, 1968లో అపోలో ప్రేయర్ లీగ్ ఏర్పడి చంద్రుని పైకి బైబిల్‌ను తీసుకెళ్లడానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగాయి. అపోలో12 సమయంలో మొదటిసారి ప్రయత్నించినప్పటికీ అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత అపోలో13లో, 512 బైబిల్ కాపీలను తీసుకెళ్లినప్పటికీ చంద్రునిపై ల్యాండింగ్ సాధ్యపడలేదు.
*చివరగా, 1971లో, అపోలో14 Astronauts ఎడ్గార్ మిచెల్ గారు తనతో పాటు బైబిల్ యొక్క కాపీలను తీసుకువెళ్లాడు.
🔻ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) పరిశుద్ధ గ్రంధాన్ని ఫిబ్రవరి 1971 అపోలో మిషన్14 ద్వారా【1×1inch (2.5/2.5.Cm)】ఇంచ్ పరిమాణం గల 300 బైబిల్స్ ని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.
🔻అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బైబిల్స్ అతి సూక్ష్మమైన Microfilmలో 1,245 పేజీలు మరియు 773,746 పదాలతో ఒక్కో బైబిల్ ని ముద్రించారు అలా ముద్రించిన 300ల బైబిల్స్ ని , చంద్రుడిపై నడిచిన అస్ట్రోనాట్ ఎడ్గర్ మిచెల్ (Edgar Mitchell) గారి కృషి వలన మరియు అపోలో ప్రేయర్ లీగ్ ( Apollo Prayer League ) సహకారంతో అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం జరిగింది..
🐠అలాగే క్రీస్తు నందు నమ్మకస్తుడైన జాన్ స్టౌట్ (John Stout) గారి అధ్వర్యంలో అంతరిక్షంలోకి వెళ్తున్న వ్యోమాగాముల (Astronauts) కొరకు ప్రత్యేకంగా ప్రార్ధించడం జరిగింది.
🔻అపోలో14లో తీసుకెళ్లిన 300ల బైబిల్స్ లలో, 200 బైబిల్స్ ని అపోలో 14 కమాండ్ మౌడ్యూల్ "కిట్టి హాక్" లోనే (Apollo 14 command module "Kitty Hawk") భద్రపరిచి ఉంచారు... ఆ బైబిల్స్ కిట్టి హాక్ తో పాటే కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి...
🔻మరో 100 బైబిల్స్ అస్ట్రోనాట్ ఎడ్గర్ మిచెల్ (Edgar Mitchell) మరియు అపోలో మిషన్ కమాండర్ అలాన్ షేపర్డ్(Alan Shepard) కలిసి చంద్రుని పై "హైల్యాండ్"(Highland) అనే ప్రదేశంలో భద్రపరిచారు...
ప్రస్తుతం ఆ 100 బైబిల్స్ "అంటరేస్"(Antares) అనే చంద్రుని మాడ్యుల్ లో ఉన్నాయి. వీటన్నింటిని మొట్టమొదటి లూనార్ బైబిల్స్ అని పిలుస్తారు...
🔻అపోలో 14 భూమికి తిరిగివచ్చినప్పుడు, ఎడ్గర్ మిచెల్ కొన్ని బైబిళ్ళను తిరిగి జాన్ స్టౌట్ కి సమర్పించాడు, 50 మైక్రో ఫిలిం మొక్కలను అపోలో ప్రార్థన లీగ్ యొక్క సభ్యులకు, మిగిలినవి జాన్ స్టౌట్ గారి చేత భద్రపరచబడినాయి.
@ భూమ్మీదనే కాదు ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్లినా మొదటగా బైబిల్ వాక్యం ఉండాలని ఆలోచనతో బైబిల్ ని చంద్రుని మీదకి తీసుకెళ్లిన శాస్త్రవేత్తల ఆలోచన గొప్పది.
@ దీని ద్వారా బైబిల్ గ్రంధంలోని వాక్యం ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైనదో ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిదీ అందుకే అనేకులకు బైబిల్ గొప్పతనాన్ని తెలియజేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్...
Do you want to See this video on YouTube then click on to this link- చంద్రుని పైకి బైబిల్ని ఎవరు & ఎందుకు తీసుకెళ్లారో తెలుసా..? https://youtu.be/6ect6_jq8qc?si=gMyt8099LjQRzDDQ
Subscribe my Youtube channel for bible content - Bible secretes Telugu
Follow us On Instagram - instagram.com/bible.secrets?utm_source=qr&r=nametag
0 Comments