అపోస్తలుల మరణం. (హతసాక్షులు)
![]() |
12 Apostles |
మన దేవుడును పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్ట నామములో, బైబిల్ సీక్రెట్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు
ఈ blog ద్వారా ఏసు ప్రభువుల వారి 12 మంది శిష్యులు ఆయన కోసం వారి ప్రాణాలను సైతం ఎలా వదిలారో తెలుసుకుందాం
ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, బైబిల్ కు సంబంధించిన చరిత్ర అనేకులకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిదీ కాబట్టి, మీకు గనుక ఈ blog నచ్చినట్లైతే లైక్ and మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దాని వల్ల మనం కూడా అనేకులకు సువార్తను ప్రకటించిన వారిగా ఉంటాము
ఆనాడు క్రీస్తు వారు, మనందరి కొరకు ఈ భూమ్మీదకి వచ్చి సిలువలో మరణించి, మూడవ రోజు తిరిగి లేచి స్వర్గరోహనుడవుతూ, సర్వలోకానికి వెళ్లి తన సువార్తను చాటమని శిష్యులకు చెప్తాడు
*ఆయన ఆజ్ఞ మేరకు శిష్యులు, ప్రపంచంలోనీ నలుమూలలు తిరిగి దేవుని సువార్తను చాటే క్రమంలో ఎన్నో అవమానాలు తిరస్కారాలు భరించారు చివరికి చావును సైతం చిరునవ్వుతో స్వీకరించి దేవుని ప్రేమను అందులోని మాధుర్యాన్ని, ఈ లోకానికి చాటుతూ చివరికి వారు ఎంత దయనీయ స్థితిలో చనిపోయారో తెలుసుకుందాం.
1. పేతురనబడిన సీమోను
*ప్రపంచంలో ఎవరూ పొందనంత హింసను పేతురు గారు అనుభవించాడు. కటినాతి కటినమైన స్థితిలో 9 నెలలు చేతులకు సంకెళ్ళు వేయబడి నేలపై పరుండడానికి కూడా అవకాశం లేని దుర్భర స్థితిలో ప్రభువు నామాన్నే స్తుతిస్తూ ధైర్యంతో ఉన్నాడు. అట్టి కటిన కారాగారం నుండి బయటకు తీసి రోమ సైనికులు సిలువ వెయ్యాలనుకున్నప్పుడు పేతురు - తను ప్రభువుతో సమానంగా సిలువ వేయుటకు యోగ్యుడినీ కాదు గనుక x-ఆకారంలో నున్న సిలువపై తన తల క్రీస్తు పాదాల తట్టు ఉంచి అనగా తలక్రిందులుగా సివువ వేయమని కోరాడు
👉ఆ విధంగా పేతురు క్రీస్తు కొరకు రోము నగరంలో చనిపోయి హతసాక్షి అయ్యాడు వాటికన్ సిటీలో సెయింట్ పీటర్ బ్యాసిలర్ చర్చి పేతురు సమాధి పైనే కట్టబడింది
2. సీమోను సహోదరుడగు ఆంధ్రెయ
👉ఆంద్రెయ గారు ఎరుషలేము చర్చిలో సేవ చేస్తుండగా యూదులు ఆయనను తరమడంతో జెరూసలేం నుండి స్కిథియాకు వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటిస్తుండగా రాళ్ళతో కొట్టి చేతులు కాళ్లు కట్టేయబడి, తర్వాత X- ఆకారపు శిలువపై తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు
*అతను సిలువలో ఉండి, ఈ ఘడియ కొరకు నన్ను నేను సమర్పించు కొని ఆశతో ఉన్నాను, అని చెప్పి
*అతన్ని హింసిస్తున్న వారికి, రెండు రోజులు సువార్తను ప్రకటించి చనిపోయాడు
👉ఆంధ్రియ అస్తికలపై పరిశుద్ద ఆంద్రెయ చర్చి నిర్మించబడింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
యాకోబు అపొస్తలుడైన యోహాను యొక్క సోదరుడు. జెబెదీ కుమారుడైన యాకోబు గారు 44వ సంవత్సరంలో స్పెయిన్లో సువార్త ప్రకటించి ఎరుషలేం తిరిగి వచ్చి చరకొనిపోబడిన యూదులకు క్రీస్తు సువార్తను ప్రకటించుటవలన రాజైన హేరోదు కోపోద్రేకుడై యాకోబును “ఖడ్గముతో శిరచ్ఛేదం చేయించాడనీ అపొ.12:2 లో చూడొచ్చు
*బ్రతుకుట క్రీస్తు కొరకే - చావైతే లాభమని ఎంచుకొని అపోస్తులలో ప్రధమ హతసాక్షి అయ్యాడు.
యాకోబు శిష్యులు ఆయన శిరస్సును దేహమును తీసుకొనివచ్చి యెరుషలేములో పాతి పెట్టిరి. ప్రస్తుతము అక్కడ పరిశుద్ధ యాకోబు దేవాలయము ఉన్నది .
4. జెబెదయి కుమారుడగు యోహాను
అపోస్తులందరిలో చిన్నవాడు యోహాను గారు
*తౌమిదియన్ చక్రవర్తి కాలములో క్రైస్తవులకు కలిగిన గొప్ప శ్రమలో యోహానును బంధించి రోమ్ కు తీసుకెళ్లి.
రోమా పట్టణమందు మరుగుచున్న నూనెలో వేయబడినప్పటికీ, ఎలాంటి హాని జరగకపోవడంతో యోహాను గారిని వదలక టర్కీలోని పత్మాసు ద్వీపమందు ఖైదీగా పంపిస్తారు, ఆ పత్మాసు ద్వీపములో ఆత్మావేశుడై ప్రకటన గ్రంథం వ్రాయడం జరిగింది. తర్వాత విడుదలై, టర్కిలో 98 సంవత్సరాల వయస్సులో ప్రశాంతమైన మరణం పొందాడు. ప్రశాంతముగా చనిపోయిన ఒకే ఒక అపొస్తలుడు యోహాను గారు. ప్రశాంతంగా చనిపోయినప్పటికీ సువార్త ప్రకటించడం కోసం అతను అనేక సందర్భాల్లో హింసించబడ్డాడు.

5.ఫిలిప్పు
ఫిలిప్ అతను గ్రీస్, సిరియా మరియు ఫ్రిజియాలకు సువార్త ప్రకటించి చివరికి, ఈజిప్టు నగరమైన పురహోలీ పట్టణంలో (హీలియోపోలిస్‌కు) సువార్త ప్రకటిస్తుండగా, సుమారు క్రీ.శ54లో అతన్ని సిలువకు కట్టి వేలాడుతుండగా రాళ్లతో కొట్టి రక్తం కారుతుండగా వారిని క్షమించమని ప్రార్థించి ప్రాణాలను వదిలాడు.
*ఫిలిప్ గారి అవశేషాలు రోమ్‌లోని హోలీ అపోస్టల్స్ బాసిలికాలో చూడవచ్చు.
6. బర్తలొమయి/నతానియేలు
👉పిలుపుతో కలిసి నేరాపోలిలో సేవ చేసి క్రీస్తుశకం 60లో ఆర్మేనియా రాజు యొక్క కుమార్తె మెదడు జబ్బుతో బాధపడినప్పుడు ఆమెను, స్వస్థపరిచెను. తర్వాత రాజు పూజించిన విగ్రహాల్లోని దయ్యమును వెళ్లగొట్టి రాజు మరియు కొందరు బాప్తిసం పొందడానికి కారణం అవ్వడంతో
👉అర్మేనియన్ లోని అన్యమతస్థులైన పూజారులు కోపోద్రేకులై రాజు సోదరుడి సహాయంతో క్రీ.శ. 68లో బర్తలోమయి గారిని బంధించి బ్రతికుండగానే చర్మమును ఒలిచి, చాలా ఘోరమైన హింసలు పెట్టడంతో ప్రాణాలను వదిలి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు
*బర్తలోమయి సమాధి ఆర్మేనియలో ఉంది
7. తోమా
అపొస్తలుడైన తోమా గారు భారతదేశంలో సంఘమును స్థాపించుటకు మిషనరీ యాత్రకు వచ్చినప్పుడు
*దక్షిణ భారత దేశంలో దేవుని సువార్తను ప్రకటిస్తు బలమైన సంఘం కట్టుచుండగా కేరళలోని మైలాపూరులో తోమా చేసిన సేవను చూసిన కాళిక దేవి గుడి పూజారులు మరియు మిస్థి అను రాజు కలిసి ఆయన్ను చంపాలని అనుకొని
*చిన్ని ద్వీపమందు ప్రార్ధించుచుండగా పూజారులు వచ్చి తోమాను బల్లెముతో పొడిచారు.
క్రీస్తు శకం 72 జూలై 3వ తేదీన తీవ్రముగా గాయపడిన తోమా బహు ప్రయాసతో ప్రాకుతూ, చెన్నైలోని ప్రస్తుతము “సెయింట్ థామస్ మౌంట్” అని పిలువబడుచున్న స్థలమునకు చేరి అచ్చట నాటబడియున్న సిలువను హత్తుకొని ప్రాణములు విడిచెను.
8. సుంకరియైన మత్తయి
అతను రోమన్ ప్రభుత్వానికి పన్ను వసూలు చేసేవాడు, కానీ అతను దేవుని కోసం అన్ని వదిలేయడానికి సిద్ధపడ్డాడు. మత్తయి క్రీ.శ. 69లో ఇథియోపియాలోని యూదులకు సువార్త ప్రచారం చేస్తూ పదిహేనేళ్లకు పైగా ఉన్నాడు, అక్కడ క్రీస్తు కొరకు జీవించగా ఈటెలతో పొడిచి గొడ్డలితో శిరచ్చేదనం చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు.
👉ఇటలీ దేశంలో సావెర్నో పట్టణంలో మత్తయి సమాధి ఉన్నది.
9. అల్ఫయి కుమారుడగు యాకోబు
రోమాప్రభుత్వంలో యరుషలేమునందు గల సంఘానికి బలమైన సేవకుడు మరియు మొదటి బిషప్ యాకోబు గారు.
*క్రీస్తునందు స్థిరమైన విశ్వాసం గలవాడైనందున, దేవాలయం యోక్క తూర్పుదక్షిణంతట్టు 100 అడుగుల ఎత్తునుండి క్రిందికి పడవేసినా మరణించక పోయేసరికి, పిల్లర్ అనే ఆయుధంతో ముళ్ళతో కూడిన దండంతో తలపై కొట్టి రాళ్లు రువ్వు చంపారు తర్వాత ఆయన శరీరాన్ని ముక్కలుగా చేశారు
10. తద్దయియను మారుపేరు గల లెబ్బయి
యోసేపు మరియల చిన్న కుమారుడు
*సీమోనుతో పాటు బబులోనులో అనేకులను దేవునిలోకి నడిపించాడు.
*పారసిక దేశంలో తద్దాయి సీమోను కలిసి సేవ చేస్తున్న సమయంలో వీరిద్దరిని అక్కడి విగ్రహారాధన చేస్తున్న వారు చంపారు
*67 A.D.లో తద్దాయి గారిని బల్లెంతో పొడిచి చంపారు
*తద్దాయి గారి హస్తికలు ఇటలీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో చూడవచ్చు.
--------------------------------------------------------------------------------------------------------------------------------
* క్రీస్తుశకం 59 నుండి 62 వరకు మెసెప్టోమియాలో సేవ చేయడానికి వెళ్లిన సీమోను తద్దయి కలుసుకొని ఇద్దరు పాలసీక దేశానికి వెళ్లారు అక్కడ విగ్రహారాధన చేసేవారు ఇద్దరిని చంపారు
*సీమోను రంపంతో కోయబడి చంపబడ్డాడు. అతని సమాధులు ఇరాన్లో ఉన్నాయి
12. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా
*జుడాస్ ఇస్కారియోట్ యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఉండి ద్రోహం చేసి ప్రభువును ముప్పై వెండి నాణెములకు అమ్మి సిలువ మరణానికి కారణమయ్యాడు తరువాత చేసిన పాపానికి ఉరివేసుకొని చనిపోయాడు.అతని అవశేషాల ఆచూకీ తెలియదు.
*తర్వాత ఇస్కరి యోత్ స్థానంలో ఏర్పరచబడినవాడు మత్తియా
13. మత్తియా
* మిగిలిన శిష్యులు అందరు కలిసి ఇసుకరియోతు యూద స్థానంలో అపొస్తలునిగా ఎన్నుకున్నారు
*ఇథియోపియాలో సువార్త ప్రకటిస్తూ క్రీస్తుశకం 67లో రాళ్లతో కొట్టి శిరచ్చేదనం చేయబడ్డాడు
14. పౌలు
ఎన్నో సార్లు శ్రమలపాలై, హింసించబడి, ఎక్కువ కాలం ఖైదిగా ఉండి జైల్లోనే క్రొత్త నిబంధనలోని అనేక పత్రికలను వ్రాశాడు. తర్వాత రోమా పట్టనమందు క్రీ.శ. 67లో కృూరుడైన నీరో చక్రవర్తి చేత హింసింపబడి శిరచ్చేదనం చేయబడి చంపబడ్డాడు.
*పౌలు గారు ఏసుక్రీస్తు వారి శిష్యులలో ఒకరు కానప్పటికీ ఆయనను శిష్యులలో ఒకరిగానే చూస్తారు.
ఆ దేవుని ప్రేమ, ఆయన కనికరం, కృప మన పట్ల ఎంతో ఉంది.
వారు పడిన శ్రమలు, బాధలు, హింసలు, కష్టముల యెదుట మనకున్న బాధలు ఎంత కావు అని మనకు జ్ఞపకం చేయు చున్నవి.
* వీళ్ళందరూ క్రీస్తు కోసం ప్రాణం పెట్టడం భాగ్యమని ఎంచుకొని యేసు నామం ఎరగనని అబద్ధం ఆడక సువార్త ఆపనందున ఎన్నో రీతులుగా హింసించబడి హతసాక్షులయ్యారు
ఎన్ని శ్రమలు, బాధలు, శోధనలు వచ్చిన ధైర్యముగా నుండి, ప్రభువులో స్థిరముగా నుండుడి. మనం కూడా క్రీస్తు కోసం జీవిద్దాం
-------------------------------------------------------------------------------------------------------------------------
Follow us on Instagram: instagram.com/bible.secrets?utm_source=qr&r=nametag
Subscribe our YouTube channel :www.youtube.com/@biblesecretstelugu
Watch this video on YouTube
దేవుడు మిమ్మును దీవించుగాక!
Amen
Visit Again
0 Comments