చేతబడి, మంత్రవిద్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?
మన దేవుడును లోక రక్షకుడైన ఏసుక్రీస్తు వారి ఉన్నత నామంలో బైబిల్ సీక్రెట్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా వందనాలు
#చేతబడి లేదా మంత్రవిద్య అంటే ఏంటి?
# చేతబడి బైబిల్లో ప్రస్తావించబడిందా?
#చేతబడి గురించి ప్రస్తావించే బైబిల్ భాగాలు ఏమిటి?
#చేతబడి గురించి బైబిల్ ఏమి చెబుతుంది?
#మంత్ర తంత్రాలు ఎందుకు ఆసక్తికరంగా అనిపిస్తుంది?
#ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
#బైబిల్ అన్నిరకాల మాయమంత్రాలను ఎందుకు బలంగా ఖండిస్తుంది?
#ఎన్నో శతాబ్దాలుగా మానవాళిని ఆకర్షిస్తున్న అంశం చేతబడి లేదా మంత్రి విద్య.
*2014 యూత్ సర్వే ప్రకారం, ఈ మధ్యకాలంలో యువతకు మంత్రతంత్రాల మీద చాలా నమ్మకం పెరిగిందంట అయితే ఇలా నమ్మకం పెరగడానికి కారణం. టీవీల్లో, సినిమాల్లో, మిగతా ప్రసార మాధ్యమాల్లో, వారి లాభసాటి వ్యాపారం కోసం, దయ్యాల కథలను, పాత్రలను, మాంత్రికులను చాలా అందంగా ఆకర్షణీయంగా ఏ ప్రమాదం లేదన్నట్లుగా చూపిస్తున్నారు. కానీ బైబిల్ ప్రకారం దయ్యాలతో సంబంధాలు పెట్టుకోవడం ఎలాంటి ప్రమాదం లేని ఒక సరదా కాదు.
*కొంతమంది కమ్యూనికేషన్ నిపుణులు అభిప్రాయం ప్రకారం, టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో, దయ్యాలను చూపించే విధానం వల్లే పిల్లలకు యౌవనస్థులకు, జ్యోతిష్యం, దయ్యాలు, రక్తపిశాచాలు, మంత్రతంత్రాలు అంటే బాగా ఆసక్తి పెరిగిపోయిందంట.
*అసలు మంత్రతంత్రాలు చాలామందికి ఎందుకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి, మరియు మంత్రతంత్రాలకు సంబంధించిన కథలు కేవలం మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటం గురించి చెప్పే కథలు మాత్రమేనా? వాటివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? మంత్రతంత్రాలు చేయడం, అలాంటి వినోదం చూడడం, మాంత్రికుల్ని సంప్రదించడం ప్రమాదకరమా? వాటి విషయంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలో, బైబిలు ఏమి చెప్తుంది? ఇప్పుడు చూద్దాం
HP Laptop 15, 13th Gen Intel Core i5-1335U, 15.6-inch (39.6 cm), FHD, 8GB DDR4, 5
12GB SSD, Intel Iris Xe graphics, 1080p FHD camera w/privacy shutter, Backlit KB,
(Win 11, White, 1.6 kg), fd0022TU
#చేతబడి లేదా మంత్రవిద్య అంటే ఏంటి?
*చేతబడి లేదా మంత్రవిద్య దీనినే బ్లాక్ మ్యాజిక్ లేదా డార్క్ మ్యాజిక్ అని కూడా పిలుస్తారు.
*మంత్ర విద్య అంటే negative ఆలోచన కలిగిన వ్యక్తులు, చెడును ఆరాధించే ప్రక్రియ. దుష్ట శక్తులను ఉపయోగించి మీకు అవసరమైన ప్రతిదాన్ని పొందడానికి షార్ట్‌కట్ ఈ బ్లాక్ మ్యాజిక్. ఈ పద్ధతి ద్వారా కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం అతీంద్రియ శక్తులను ఉపయోగించి ఇతర వ్యక్తులను నియంత్రించడానికి, వారికి నష్టం, అపాయం కలిగించడానికి, గాయపరచడానికి, చంపడానికి, లేదా చెడు చేయడానికి ఉపయోగిస్తారు.
#చేతబడిని బైబిల్ ఎందుకు ఖండించింది?
#బైబిల్ అన్నిరకాల మాయమంత్రాలను ఎందుకు బలంగా ఖండిస్తుంది?
#మంత్రతంత్రాల్ని బైబిలు ఎందుకు తీవ్రంగా ఖండిస్తుంది?
*బైబిల్ అన్నిరకాల మాయమంత్రాలను బలంగా ఖండిస్తుంది ఎందుకంటే అవి చెడు నుండి వచ్చాయి మంత్రతంత్రాలు చేస్తే, దయ్యాలతో లేదా చెడ్డదూతలతో సంబంధం పెట్టుకున్నట్టే.
*దుష్టశక్తులతో అనుబంధం మరియు అతీంద్రియ శక్తుల కారణంగా బైబిల్ చేతబడిని ఖండిస్తుంది. ఇది ప్రేమ, నీతి మరియు దేవునికి విధేయత అనే వాటికి విరుద్ధంగా ఉంటుంది. చేతబడిలో పాల్గొనడం అంటే అది దేవుని మాటను వ్యతిరేకించడమే అవుతుంది
*ఎందుకంటే యేసయ్య 38:4; ప్రకటన 5:11ప్రకారం దేవుడు భూమిని చేయడానికి చాలాకాలం క్రితమే ఆయన ఎన్నో కోట్ల దేవదూతల్ని చేశాడు. ఈ దూతల్లో ప్రతి ఒక్కరికి దేవుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. అంటే మంచి చేయాలో చెడు చేయాలో నిర్ణయించుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. కానీ వాళ్లలో కొందరు దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు శత్రువులు అయ్యారని బైబిలు చెప్తుంది. దాంతో పరలోకం నుండి భూమ్మీదకి బహిష్కరించబడ్డారు. దాంతో భూమి మీద పడి ప్రజల మధ్య సమస్యలు సృష్టించడ మొదలుపెట్టారు దాని ఫలితంగా భూమి అంతా ‘బలాత్కారముతో నిండిపోయినట్లు—ఆదికాండము 6:2-5,యూదా 6లో చూడొచ్చు.
#మంత్ర తంత్రాలు ఎందుకు ఆసక్తికరంగా అనిపిస్తుంది?
*ప్రపంచంలో చాలా మంది ప్రజలు మాంత్రికులు లేదా భూతవైద్యుల ద్వారా దయ్యాలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్లు నక్షత్రాల్ని, శకునాల్ని, రాశులను లేదా అరచేతిని చూస్తు సోదె లేదా జ్యోతిష్యం ద్వారా వారి భవిష్యత్తు తెలుసుకోవడానికి, మరియు చనిపోయిన తమ ప్రియమైనవాళ్లతో మాట్లాడాలని ప్రయత్నిస్తారు. పై కారణాలు తప్పేమీ కాదు. ఎందుకంటే, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే, చనిపోయిన మనవాళ్లను కలవాలని కోరిక అందరికీ ఉంటుంది. కానీ, అది చాలా ప్రమాదంతో కూడుకున్నది అందులో ఉన్న ప్రమాదాల్ని తెలుసుకోవడం ప్రాముఖ్యం.
*ఎందుకంటే భవిష్యత్తును తెలుసుకోవాలని మనుషుల్లో సహజంగా ఉండే కోరికను కూడా ఈ మానవాతీత శక్తులు బాగా వాడుకుంటూ చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్లను, భవిష్యత్తు చెప్పేవాళ్లను, సోదె చెప్పేవాళ్లను, జ్యోతిష్యం చెప్పేవాళ్ల ద్వారా ప్రజల్ని మోసం చేస్తు ఆ దుష్టశక్తులు లక్షలమందిని తప్పుదారి పట్టిస్తున్నారని బైబిల్ చెప్తుంది.(ప్రకటన 12:9)
*మంత్రతంత్రాల వల్ల భవిష్యత్తు తెలుసుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ, యెషయా 46:10లో చూస్తే ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను అని దేవుడు అంటున్నాడు. (యాకోబు 4:13, 14)
*మంత్రతంత్రాలు వల్ల బ్రతికున్న వాళ్లు చనిపోయిన వాళ్ళతో మాట్లాడగలరని అనుకుంటున్నారు కానీ,బైబిల్లోని ప్రసంగి9:5, చూస్తే “చచ్చినవారు ఏమియు ఎరుగరు ... పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు అని ఉంది. అయితే సాతాను మిమ్మల్ని మోసం చేస్తూ చనిపోయిన మీ వాళ్ళతో మాట్లాడుతున్నారని అనుకునేలా చేస్తున్నాడు
#దయ్యాల వెనుక ఎవరు ఉన్నారు?
#ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
*దయ్యాలను, మానవాతీత శక్తులను, మంత్రవిద్యకు సంబంధించిన వేటినైనా చాలామంది సందేహిస్తారు లేదా నమ్మరు, అలాంటి వాటిని కల్పితాలుగా లేదా సినిమా రచయితలు ఆసక్తికరంగా రాసిన కథలుగా చూస్తారు. కానీ, బైబిల్ మాత్రం అలా చూడట్లేదు. దయ్యాలతో సంబంధాలు పెట్టుకోవడాన్ని చాలా ఖచ్చితంగా, స్పష్టంగా ఖండిస్తుంది.
*ద్వితీయోపదేశకాండము 18:10-13లో చూస్తే సోదె చెప్పేవాడు, ఇంద్రజాలం చేసేవాడు, శకునాలు చూసేవాడు, మంత్రగాడు, మంత్రం వేసి ఇతరుల్ని బంధించేవాడు, భవిష్యత్తు చెప్పేవాడు, దయ్యములయొద్ద విచారణ చేసేవాడు లేదా చనిపోయినవాళ్లను సంప్రదించేవాడు. మీ మధ్య ఉండనియ్యకూడదు.” ఎందుకంటే ఇవి చేసేవాళ్లంతా యెహోవాకు అసహ్యులు అని వ్రాయబడింది.
# చేతబడి బైబిల్లో ప్రస్తావించబడిందా?
*చేతబడి గురించి ప్రస్తావించే బైబిల్ భాగాలు ఏమిటి?
⭐చేతబడి గురించి బైబిల్ ఏమి చెబుతుంది? ఇప్పుడు చూద్దాం
*మంత్రాలు, భవిష్యవాణి, ఆత్మలతో ప్రమేయం మరియు ఇతర చీకటి ఆధ్యాత్మిక కార్యకలాపాలతో సహా ఈ విధమైన చేతబడిని బైబిల్ స్పష్టంగా ఖండిస్తుంది. ఇటువంటి అభ్యాసాలకు వ్యతిరేకంగా వాటిని చేయకూడదని అనేక వాక్యాలు ఉన్నాయి
*చీకటి కళలను అభ్యసించే వారితో ఎటువంటి సంబంధం ఉండకూడదని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. అపో.కార్యములు 19:19లో ప్రజలు క్రీస్తును తెలుసుకున్నప్పుడు, మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వెల యేబదివేల వెండి రూకలాయెను అని రాయబడింది
*ఇంకా ద్వితీయోపదేశకాండము 18:10, నిర్గమకాండము 22:18, లేవీయకాండము 19:26, 31:1 శామ్యూల్ 15:23, 2 రాజులు 21:6, మీకా 3:7, 5:12, గలతీయులు 5:19-21లో కూడా వాటికి సంబంధించిన విషయాలు చూడొచ్చు.
*బైబిల్, అన్ని రకాల చేతబడిని బైబిల్ ఖండించింది. ఇలాంటి అభ్యాసం లేదా కళ పాపం మరియు ప్రమాదకరమైనది కూడా
మీ వయసువాళ్లు ఏమంటున్నారు?
*చేతబడిని బైబిల్ క్షమిస్తుందా అంటే అవుననే చెప్పాలి , చేతబడినీ లేదా క్షుద్ర అభ్యాసాలలో నిమగ్నమైన వారు వాటిని మానేసి పశ్చాత్తాప పడి యేసును రక్షకునిగా అంగీకరించడం ద్వారా, క్షమాపణ దొరుకుతుంది.
*ఒకవేళ మనం అలాంటి వాటికి గురైనప్పుడు పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడి దేవునికి ప్రార్ధన చేయాలి ఆయన వాక్యానుసారం నడుచుకుంటే వాటి నుండి విడుదల పొందుతాం అని బైబిల్ బోధిస్తుంది
*ఆధ్యాత్మికత లేని భూసంబంధమైన జ్ఞానం సాతాను నుండి వస్తుంది మనమేం చేసిన దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేలా ఉండాలి.
*కొన్ని మానవాతీత శక్తులు మనకు సహాయం చేస్తున్నట్లు ఇప్పుడు సానుకూల ప్రభావాలను కనిపించినప్పటికీ, చివరికి అవి హాని చేస్తాయి.
*ఈ కారణాల వల్ల క్రైస్తవులమైన మనం మంత్రతంత్రాలను ప్రోత్సహించేవాటికి దూరంగా ఉంటూ వాటి మాయలో కూరుకుపోకుండా క్రీస్తులో స్థిరంగా నిలబడాలి దానివల్ల మనం దేవుని హృదయాన్ని సంతోష పెట్టిన వారిగా ఉంటాము.
మంత్రతంత్రాల్లో ఉన్న అబద్ధాన్ని బయటపెట్టే ఒకే ఒక్క మార్గం బైబిలు.
*అంత్య కాలంలో మాంత్రిక కళలను అభ్యసించే వారు చేతబడి ద్వారా మోసం చేసేవారు దేవుని రెండో రాకడలో ఘోరమైన తీర్పు పొంది అగ్నిగుండంలో వేయబడతారని బైబిల్ హెచ్చరిస్తుంది... కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం..
* దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్...
Watch more on my YouTube channel...-https://youtu.be/iL0pdd5zSEM?si=bWyrLvpLILgOxMXj
Follow us on instagram -instagram.com/bible.secrets?utm_source=qr&r=nametag
Visit our YouTube channel for more interesting content -www.youtube.com/@biblesecretstelugu
-----------------------------------------------Visit Again---------------------------------------------------
0 Comments