☀ క్రైస్తవ్యం పై అపోహలు అర్ధం లేని ఆరోపణలు ఎందుకు???
*మన దేవుడును లోక రక్షకుడైన ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్ట నామములో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు
* క్రైస్తవ్యాన్ని గూర్చి చాలామందిలో అనేక అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి క్రైస్తవ్యం మా దేశంలో పుట్టలేదని విదేశీ మతం అని, విదేశీ ధనం వస్తుందని ఇక్కడి సంస్కృతులను నాశనం చేస్తున్నారని, మరియు క్రైస్తవ్యం పుట్టి 2000 సంవత్సరాలు మాత్రమే అవుతుందని ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి వాటిని ఇప్పుడు క్లియర్ చేద్దాం
*క్రైస్తవ్యం, ప్రజల బ్రతుకులు మారుస్తూ జీవితాల్లో వెలుగులు నింపుతుంటే గిట్టని సోదరులెందరో క్రైస్తవ్యం పై విషప్రచారాన్ని చేస్తున్నారు. వారు ఆరోపించే ముఖ్యమైన ఆరోపణల్లో కొన్ని అపోహలను దూరం చేసే ఈ మా ప్రయత్నo ...
●అపోహ1: క్రైస్తవ్యం విదేశీ మతం అని
◆నిజం: ఇదొక అర్ధం లేని ప్రశ్న మరియు అపోహ, ఎందుకంటే దేవుడు లేదా దైవత్వం అనేవి ప్రపంచానికి సమస్త సృష్టికి సంబంధించినవి. దేవుడిని ఒక దేశం లేదా ఒక ప్రదేశానికి పరిమితం చేయలేము. విదేశీ మతం లేదా మార్గం అన్న భావన గనక ఉంటే ఐక్యరాజ్య సమితి లో ప్రస్తుతం ఉన్న దేశాల సంఖ్య 195 అంటే దేశానికో మతం చొప్పున 195 మతాలు ఉండాలి,మరేదైనా కొత్త దేశం ఏర్పడితే కొత్త దేవుణ్ణి సృష్టించుకోవాల్సిన అవసరం ఉంటుందా??.
*దేవుడు అంటే సర్వ లోకానికి సృష్టికర్త దేశానికో దేవుడు ఉండకూడదు అలా ఉంటే అది పూర్తిగా అర్ధరహితం.
●అపోహా2: మా దేశంలో పుట్టని దేవుణ్ణి పూజించవద్దు...
◆నిజం: ఇది కూడా మొదటి అపోహ లో భాగం అయినప్పటికీ మరింత లోతుగా వెళ్తే సమస్త లోక పాపములు పరిహరించుటకై నిర్దోష రక్తం బలిగా నిచ్చుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి మానవ రూపిగా రావలసి వచ్చింది.
ఈ లోకంలో మానవరూపిగా రావడానికి ఒక ప్రదేశం కావాలి
ముందుగా లేఖనాలలో పేర్కొనట్టుగా("బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. Micah(మీకా) 5:2")లో వ్రాయబడి ఉన్న ప్రకారం ఏసుక్రీస్తు వారు ఇశ్రాయేలు దేశంలోని బేత్లెహేములో జన్మించాడు.
అలా అని ఆ దేశ ప్రజలకు మాత్రమే దేవుడు అనడం ఎంతవరకు సమంజసం.
ఉదాహరణకు హిందూ మతస్తులు ఆరాధించే రాముడు భారతదేశం లోని అయోధ్య లో పుట్టాడు. అలాంటప్పుడు రాముడు కేవలం భారతదేశానికి మాత్రమే దేవుడు విదేశీయులు ఎవరు ఆరాధించవద్దు అనవచ్చా, మహమ్మద్ ప్రవక్త సౌదీ లోని మక్కా లో జన్మించాడు కాబట్టి అల్లాహ్ ఆ దేశానికి(సౌదీకి) మాత్రమే దేవుడు అనవచ్చా ఎంత అర్ధరహితం. అందువలన దేవున్నీ దేశానికి ముడిపెట్టడం మూర్ఖత్వమే అవుతుంది.దేవుడు సృష్టికర్త ప్రపంచమంతా ఆరాదించవచ్చు.
●అపోహ3: రెండువేల సంవత్సరాల పూర్వం అసలు యేసు క్రీస్తు లేడు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్.
◆నిజం: 2000 సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు జన్మించారు అలాగని అంతకుముందు క్రీస్తు లేడు అనుకోవడం అమాయకత్వం. ఈ సృష్టి ప్రారంభానికి ముందే దేవుడున్నాడు అయితే రెండు వేల సంవత్సరాలకు పూర్వం యేసు క్రీస్తుల వారు పాపంలో పడి ఉన్న ప్రజలను రక్షించడానికి మానవ రూపిగా లోకానికి వచ్చారు. ఇది తెలుసుకొని ప్రజలు క్రైస్తవ్యం పుట్టే 2000 సంవత్సరాలు అవుతుందని అంటున్నారు
యోహాను సువార్త 1:1,2,14 చూసినట్లయితే ఆది మొదలుకొని నేడు రేపు నిరంతరం క్రీస్తు తండ్రి(యెహోవాతో) కూడా ఉన్నవాడు అని ఉంది.
1.ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
2.ఆయన(క్రీస్తు) ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
14.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను.(యేసు క్రీస్తు అనే మానవ రూప దారిగా 2000 సం.పూర్వం).
దీన్ని బట్టి, క్రీస్తు వారు 2000 సంవత్సరాల పూర్వం ఈ భూమి మీదకి రావడం జరిగింది కానీ యేసు క్రీస్తు ఆది అంతము లేని వాడుగా ఎల్లప్పుడూ దేవుడిగా ఉన్నాడు.
అపోహ4హ: క్రైస్తవ్యం స్థానిక సంస్కృతులను నాశనం చేస్తుంది అంటున్నారు
◆నిజం: క్రైస్తవ్యం పూర్తిగా నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించు అన్న క్రీస్తు మాటల పునాది పై నిర్మించబడింది.
క్రీస్తు నేర్పించిన ప్రేమ,అహింసా,సత్యం,నీతి, అనే మార్గాల ద్వారా ప్రజల మనసులను చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది. అయితే ఈ ప్రక్రియలో ఎంతో మంది ప్రజలు తమ అసాంఘిక సంస్కృతులను, మూఢనమ్మకాలతో కూడిన ఆచారాలను వదిలి క్రీస్తును వెంబడించారు. ఆఫ్రికా దేశాల్లోని ఎన్నో తెగలు నరమాంస భక్షకుల సంస్కృతిని మార్చి నేడు వారి జీవితాల్లో వెలుగును నింపింది. అదేవిధంగా నరబలులు, పసిబాల హత్యలు, బహుభార్యత్వం లాంటి ఎన్నో దూరాచారాలను రూపుమాపింది.(రిఫరెన్స్ Chadwick, Owen (1998). A History of Christianity. St. Martin's Press. p. 242. ISBN 9780312187231.). మంచి ఆచారాలను సంస్కృతులను నేటికి స్వీకరిస్తూనే ఆయా ప్రదేశాల నాగరికతలకు అనుగుణంగా మార్పు చెందుతూ ఉంది(ఉదా: భారతదేశపు చీరకట్టు, కోయ జాతి ప్రజల వేషధారణ,వివిధ ప్రదేశాల వివాహ పద్ధతులు) .వీటన్నిటిని బట్టి చూస్తే నాశనం చేయడం కాదు గాని నాగారికతను పెంపొందించడం అని అర్ధం అవుతుంది.
●అపోహ5: క్రైస్తవులకు విదేశీ డబ్బు విస్తృతంగా వస్తుంది
నిజం:భారత దేశం లో 19,20 శతాబ్దాల్లో విదేశీ మిషనరీలు సేవ నిమిత్తం బహుగా పర్యటించారు. అందులో భాగంగానే మిషనరీ చర్చిలను,విద్యాలయాలు, వైద్యాలయాలు, సాంఘిక సంక్షేమ సంఘాలు స్థాపించారు వాటికి వారి సొంత ధనాన్ని ఉపయోగించారు. వారు ఈ దేశాన్ని విడిచి వెళుతూ ఇక్కడి నమ్మకస్తులైన సేవకులకు, ట్రస్ట్ లకు వాటి నిర్వహణను అప్పగించడం జరిగింది. వారు విదేశాల్లో నుండి కూడా ఇక్కడి సేవా కార్యక్రమాల కోసం ధనాన్ని పంపించేవారు అలా 20వ శతాబ్దం చివరి వరకు కూడ నడిచింది. ఆ తర్వాత ఇక్కడి క్రైస్తవుల నిధుల తోనే నిర్వహణ జరుగుతుంది అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి అన్ని సంఘాలు అలా నడవలేదు కేవలం మిషనరీల ఆధ్వర్యంలో నిర్వహింపబడే మెదక్ చర్చి లాంటివి మాత్రమే నిర్వహించబడ్డాయి కానీ మిగతా సంఘాలు, క్రైస్తవులు తమ సొంత డబ్బులు కూడబెట్టి తమకంటూ చర్చిలను నిర్మించుకోవడం జరిగింది. తమకోసం బహు భారం కలిగి సేవ చేస్తున్న సంఘ సేవకులకు పోషణ నిమిత్థం కానుకలు, దశమ భాగాలు మాత్రం ఇస్తూ ఉన్నారు, వీరేవారికి విదేశీ నిధులు రావు. ఒకవేళ వస్తే గ్రామాల్లో పూరి గుడిసెల్లో, అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో కాలినడకన ప్రయాణం చేస్తూ సేవ చేసే సువార్తికులు కనిపించేవారే కాదు. అందరూ డూప్లెక్స్ లు కట్టి ఫోర్ వీలర్ లో తిరిగేవారు. కానీ అలా జరగడం లేదు కేవలం 0.1% సేవకులు మాత్రమే ధనిక స్థితిని కలిగియున్నారు అది కూడా వారి సువార్త విస్తరింపబడిన విధంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వారే(సంఘస్తులు అర్పించిన కానుకలు). ఇదంతా గమనించిన తర్వాత విదేశీ డబ్బు అనేది పూర్తిగా అబద్ధం అనే విషయం బోధపడుతుంది...
*చివరిగా ఎవరో ఏదో చెప్పారని క్రైస్తవ్యం పై ద్వేషం పెంచుకోకుండా ఇలాంటి అపోహలను వీడి నిజమైన దేవుని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ప్రేమతో జీవించండి ఇలాంటి topics ఇంకా మీ ముందుకు రాబోతున్నాయి ఇంకా బైబిల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్... 🙌🙌
Follow us on Instagram: instagram.com/bible.secrets?utm_source=qr&r=nametag
For more interesting videos visit our Youtube channel- www.youtube.com/@biblesecretstelugu
watch this videos on YouTube -
0 Comments