భూ కేంద్రక సిద్ధాంతాన్ని బైబిల్ బోధిస్తుందా? || Does Bible Teaches Geocentric theory?
పరిశుద్ధుడను సర్వలోకానికి సృష్టికర్త అయిన ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్ట నామములో బైబిల్ సీక్రెట్ వీక్షకులందరికీ మా వందనాలు
*పురాతన, & మధ్యయుగ కాలంలో భూమి సౌర వ్యవస్థకు కేంద్రమని, ఇతర గ్రహాలు నక్షత్రాలు స్థిరంగా ఉన్న భూమి చుట్టూ తిరుగుతున్నాయని చాలామంది బలంగా విశ్వసించారు. భూమి నిశ్చలంగా ఎలాంటి చలనం లేకుండా ఉండి సూర్యచంద్రులు భూమి చుట్టూ తిరుగుతున్నాయనే నమ్మకం కొంత కాలం వరకు ఉండేది
*భూమి ఉత్తర నుండి చూస్తే అపసవ్య దిశలో సగటున 149.60 మిలియన్ కిమీ (92.96 మిలియన్ మైళ్ళు) దూరంలో సూర్యుడు చుట్టూ గంటకు దాదాపు 600,000 మైళ్ల వేగంతో అంతరిక్షంలో ప్రయాణిస్తుంటాడు ఒక కక్ష్య పూర్తవడానికి 365.256 రోజులు పడుతుంది.
అయితే, యోబు 38:12-14 వరకు చూస్తే భూమి తిరుగుతుందని అది పగలు మరియు రాత్రికి కారణమవుతుందని చెప్పింది. అయితే ప్రారంభ కాథలిక్ మత పెద్దల దురభిప్రాయం వల్ల బైబిల్ సూర్య కేంద్రకనికి బదులు భూ కేంద్రక సిద్ధాంతాన్ని బోధిస్తుందని తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ అది వాస్తవం కాదు.
*అయితే అసలు నిజం ఏంటి భూమిని కేంద్రంగా చేసుకొని సూర్యుడు ఇతర గ్రహాలు తిరుగుతున్నాయా క్యాథలిక్ పెద్దలు ఇలా బోధించడానికి కారణాలేంటి? అసలు బైబిల్ ఏం బోధిస్తుందో దాన్ని చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం
*ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ బైబిల్ సీక్రెట్స్ ద్వారా వస్తున్న వీడియోస్ and Blogs గనుక మీకు నచ్చినట్లైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకి షేర్ చేయండి.
సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని బైబిలు చెప్తుందా? ఇప్పుడు చూద్దాం
*కీర్తనలు 19:6 లో చూస్తే అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. అని వ్రాయబడి ఉంది
కొంతమంది శాస్త్రవేత్తలు ఈ వాక్యాన్ని చూసి బైబిల్ భూ కేంద్రక సిద్ధాంతాన్ని బోధిస్తుందని వాళ్లు అనుకున్నారు అంటే భూమిని కేంద్రంగా చేసుకొని సూర్యంతో సహా మిగిలిన గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయని అనుకున్నారు కానీ
నిజంగా బైబిల్ ని గమనిస్తే భూ కేంద్రక సిద్ధాంతం మనకు కనిపించదు.
*ప్రసంగి1:5 లో చూస్తే సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. అయితే, ఆ మాటలు భూమ్మీది నుండి సూర్యుణ్ణి చూసినప్పుడు దాని కదలికలు ఎలా ఉంటాయో చెప్తున్నాయి. ఈ రోజు కూడా, మనం స్యూరోదయం, సూర్యాస్తమయం వంటి పదాలు వాడుతాం కానీ మనకు తెలుసు ఈ భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని దాని అర్థం కాదు కదా
*ఇక మనం చరిత్రలోకి వెళ్తే, నికోలస్ కోపర్నికస్ 1502 సంవత్సరంలో తన 29 ఏళ్ళ వయస్సులో రోమ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరాడు. విశ్వానికి కేంద్రం భూమి, సూర్యుడు, ఈ రెంటిలో ఏది? అనే అనుమానం పట్టుకుంది కోపర్నికస్ కి , అంతకుముందు అరిస్టాటిల్, టోలెమీలు భూ కేంద్రక సిద్ధాంతం బలపరిచారు.
★పైథాగరస్ సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైందని నమ్మాడు. ఈ రెండింటిలో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో కోపర్నికస్ కు అర్థం కాలేదు. ఈ విషయం పై ఆలోచిస్తూ రాజీనామా చేసి ప్రోవెన్ బర్గ్ లో కానన్ అనే మతాధికారిగా చేరి బైబిల్ బోధనలు చేసేవాడు.(ఇప్పటికి ఈ విషయం చాలా మందికి తెలియదు) ఆ తర్వాత గ్రహాల కదలికల పై ప్రయోగాలు చేసిన ఇతను, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని తన సిద్ధాంతాలతో నిరూపించాడు.
★కాని బైబిల్ లోని విషయాలు సరిగా బోధపడని ఆనాటి రోమన్ క్యాతోలిక్ శాస్త్రులు “ప్రపంచానికి భూమి కేంద్రమని సూర్యుడుతో సహా అన్ని గ్రహాలు భూమి చుట్టే తిరుగుతాయని, భూ కేంద్రక సిద్ధాంతమే సత్యం అని ప్రకటించేవారు.” (బైబిల్ లో ఇలా చెప్పబడలేదు )
కోపర్నికస్ తన ప్రయోగాల ఫలితాన్ని ప్రజల ముందుకు తెచ్చే ధైర్యం లేక అప్పటి పోప్ గా ఉన్న పోప్ పాల్ -3 కి వ్రాతపూర్వకంగా సమర్పించాడు. అయితే పోప్ పాల్ -3 ఈ విషయాన్నీ అంగీకరించక ఆ వ్రాతలను ఎవరికీ తెలియకుండా రహస్య ప్రదేశంలో భద్రపరిచాడు.
కోపర్నికస్ బోధనలు విన్న ప్రొటెస్టెంట్ క్రైస్తవులు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరుస్తూ వచ్చారు. కాని రోమన్ నియంతృత్వ అధికారానికి బయపడి ఎవరు కూడా దాని గురించి బహిరంగంగా మాట్లాడలేకపోయారు.
★17 శతాబ్దం తొలి నాళ్లలో గెలీలియో గెలీలి అనే ప్రముఖ ఖగోళ శాస్రవేత్త క్రీ.శ.1609 లో టెలిస్కోప్ ని కనుగొనడం ద్వారా, గ్రహాల స్థితులను, వాటి గమనాన్ని గ్రహించి “సుర్యకేంద్రక సిద్ధాంతం” నిజమని కోపర్నికస్ సిద్ధాంతాన్ని బలపరిచాడు. అయితే అప్పటికి రోమన్ అధికారిక విచారణ” కాలం ఇంకా అమలులో ఉన్నందున, గెలీలియో బోధనలు, క్యాతోలిక్ మత పెద్దలు బోధించినటువంటి “భుకేంద్రక” సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండటంతో క్యాతోలిక్ మతాధికారులు ఇతని ప్రయోగాల్ని నిషేధించి, ఇతని ప్రతిపాదనలను బహిర్గతం చేయకూడదు, ఒకవేళ చేస్తే కఠిన శిక్ష విధిస్తాం అని చెప్పేసరికి క్రీ.శ.1630 వరకు గెలీలియో గారు ఎవరికీ చెప్పకుండా ఉండిపోయాడు. తన స్నేహితుడు మతాధికారిగా అవ్వడంతో తన ప్రయోగాలను పుస్తక రూపం లో ప్రచురించే అవకాశాన్ని పొంది "Dialogues concerning the two chief world systems" అనే పుస్తకం గా ప్రచురించాడు.
★దీంతో మత పెద్దల ఆగ్రహానికి గురై జైలు శిక్ష విధింపబడినప్పుడు, అతను కూడా క్రైస్తవుడే అయినందున “ప్రార్ధనా పూర్వకంగా దేవుడే నిజాలను బయలుపరుచమని తనకు ఆజ్ఞాపించాడని” మతాధికారులతో చెప్పినప్పటికీ , తమ అధికారమే లక్ష్యంగా ఉన్న క్యాతోలిక్ మత పెద్దలు ఏది విని గ్రహించే స్థితిలో లేక గెలీలియోకి 1633లో యావజ్జీవ కారాగార శిక్ష ను విధించారు. ఈ క్రమంలోనే కళ్ళు కోల్పోయి 1642లో జైలు లోనే తుది శ్వాస విడిచాడు గెలీలియో.
అతను చనిపోయినగానీ అతని రచనలను, సిద్ధాంతాలను ప్రొటెస్టెంట్ క్రైస్తవులు వ్యాప్తిచేశారు,
ప్రొటెస్టెంట్ క్రైస్తవులు మరియు ఇతర సెక్యులర్ భావాలు గల ప్రజలలో ఈ రచనలు విరివిగా వ్యాపించాయి.
★గెలిలియో కంటే కొంచం పెద్దవాడైన బ్రూనో గారు కూడా , తన ఖగోళ పరిశోధనలలో, ఆధ్యాత్మిక పరిశోధనలలో బహు విప్లవాత్మకంగా ఆలోచించేవాడు, రోమన్ క్యాతొలిక్ విచారణ ప్రభుత్వం ప్రతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాడు.
ఈయన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ప్రయోగాల ద్వారా రుజువు చేస్తానని ప్రకటించడు. క్రీ.శ.1592 లో వెనిస్ నగరానికి వెళ్లిన బ్రూనో అక్కడ వెనీటికన్ విచారణ అధికారం నడుస్తున్న కాలంలో అక్కడి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు సాగించడం మరియు వారి విశ్వాసాలను కించపరిచే సిద్ధాంతాలను ప్రకటించడం వల్ల వారి ఆగ్రహానికి గురై ఇటలీ కి బహిష్కరించబడ్డాడు
★బ్రూనో బహుదేవతారాధన, తాంత్రిక విద్య అభ్యసించడం, రోమన్ క్యాతొలిక్ వారి విశ్వాసాలకు వ్యతిరేకమైన మత సిద్ధాంతాలు ప్రకటించడం వంటివి చేయడం వల్ల ఎన్నో సార్లు రోమన్ మఠాధిపతుల హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా , తనకు నచ్చినట్టు ప్రవర్తించడంతో వారు బ్రూనో కి మరణ శిక్ష విధించారు. చివరి గడియల్లో కూడా తమ సిద్ధాంతాలను నిజమని ఒప్పుకుంటే విడిచి పెడతాం అని చెప్పినప్పటికీ, ఎవరికి తలోంచే స్వభావం లేని బ్రూనో ససేమిరా అనడంతో క్రీ.శ.1600 సంవత్సరంలో
బహిరంగంగా "టవర్ ఆఫ్ నొన" అనే ప్రాంతం లో అతనిని సజీవ దహనం చేశారు మతాధిపతులు(ఇది పూర్తిగా బైబిల్ కి విరుద్ధం).
★ఈ రెండు సంఘటనలు మాత్రమే కాకుండా పోప్ సిక్స్టెస్ -5 ఏర్పరచిన స్పానిష్ విచారణ అధికార ప్రభుత్వం మరియు "రోమన్ క్యాతొలిక్ విచారణ అధికార ప్రభుత్వం " ఇటలీలో అమలులో ఉన్నప్పుడు దాదాపు 100-200 సంవత్సరాల్లో ఏకంగా 20 వేలకు పై చిలుకు ప్రొటెస్టెంట్ క్రైస్తవులు & ఇతర మతస్తులు అధికార ధిక్కరణ క్రింద హత్య చేయబడ్డారు.
సృష్టికర్తయైన దేవుడు మానవుల కోసము భూమిని ఏర్పాటు చేసి, సూర్యుణ్ణి వెలుగును ఏలుటకు నియమించాడు. అంత మాత్రాన భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని రాసి లేదు ఇదే విషయాన్ని ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కోపర్ణికస్ ,గెలిలియో , బ్రూనో లను సమర్ధించేలా చేసాయి.
ఆ తర్వాత ఎందరో పోప్ లు రోమన్ క్యాతొలిక్ చరిత్రలో అధికారాన్ని పొందారు కానీ ఎవరూ ఈ విధంగా చేయలేదు. అంతే గాక క్యాతొలిక్ చర్చ్ ద్వారా నియమితులైన ఎంతో మంది శాస్త్రవేత్తలు నిజానిజాలు ప్రపంచానికి తెలియజేసారు. వారి ద్వారా విద్యాలయాలు నెలకొల్పబడినాయి , విజ్ఞాన శాస్త్ర గ్రంధాలు రచియింపడినాయి, ప్రపంచానికి విద్యా వైద్యాన్ని అందించారు, ప్రస్తుతం వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చారిటీ నిర్వహిస్తూ అనాధ శరణలయాలు, వృద్ధాశ్రమలు, నిర్వహిస్తున్నారు, మదర్ థెరిస్సా ను కూడా కుష్ఠురోగుల సంక్షేమం కోసం భారతదేశానికి సేవ చేయడానికి పంపించింది రోమన్ క్యాథలిక్ వారే...
కేవలం 16,17 వ శతాబ్దాలు మాత్రమే రోమన్ క్యాతొలిక్ చర్చ్ చరిత్రలో చీకటి రోజులు గా మిగిలిపోయాయి...
గెలిలియో, బ్రూనోల హింస కేవలం ఆ రెండు శతాబ్దాల రోమన్ క్యాథలిక్ పోప్ ల యొక్క అప్పటి రాజ్యాధికారం నిలుపుకొనుటకు, దేవుని పేరుతో , బైబిల్ ని అడ్డుపెట్టుకొని చేసిన దాష్టిక హత్యా రాజకీయ దామనకాండ మాత్రమే తప్పితే దీనికి బైబిల్ కి మరియు క్రైస్తవులకు ఎటువంటి సంబంధం లేదని ఖరాఖండిగా చెప్పొచ్చు, దీన్ని బైబిల్ గానీ క్రైస్తవులు గానీ ఎంతమాత్రమూ సమర్ధించదు, తీవ్రంగా ఖండిస్తుంది...
*ఈ కాలంలో కూడా ఎన్నో తప్పుడు బోధనల వల్ల బైబిల్ కి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లోక సంబంధంగా ఎవరు ఏదో చెప్పారని ఫాలో అవ్వకుండా బైబిల్ ఏం చెప్తుందో కరెక్ట్ గా గ్రహించండి వాక్యానుసారంగా జీవించండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్..
Watch this full video in my youbute channel..
Subscribe to my YouTube channel; www.youtube.com/@biblesecretstelugu
Follow us on instagram for more content: instagram.com/bible.secrets?utm_source=qr&r=nametag
Thank you and visit again



0 Comments