రోమన్ క్యాథలిక్ (Negative shades of Roman Catholic)
Note : There are lot of good things, good shades of Roman Catholic but here we discuss only negative shades of Roman Catholic.
మన దేవుడును సృష్టికర్త అయిన ఏసుక్రీస్తు వారి ఉన్నత నామములో బైబిల్ సీక్రెట్ వీక్షకులందరికీ మా వందనాలు. ఈరోజు ఈ Blog ద్వారా రోమన్ క్యాథలిక్ శాఖ గూర్చి పూర్తి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుందాం
ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యంలో వివిధ మతాచారా శాఖలున్నాయి, వీటినే డినమినేషన్స్ అంటారు, నేడున్న Christian (denominations) శాఖలన్నింటిలోనికి పురాతనమైనది, రోమన్ క్యాథలిక్..అపోస్తలుల ద్వారా స్థాపించబడిన ఒకే ఒక్క శాఖ రోమన్ క్యాతలిక్. అందులో ఏ సందేహము లేదు.
ప్రస్తుతం ప్రపంచ క్రైస్తవ జనాభాలో 50%శాతంతో అనగా 120 కోట్లతో క్యాథలిక్ శాఖ వారు 1st placeలో ఉన్నారు
నేడున్న ఏ శాఖ పేరిటా బైబిల్లో పత్రిక రాయబడలేదు. ఒక్క రోమాలో ఉన్న సంఘానికే పౌలు పత్రిక రాశాడు. పత్రికల్లో
మొదటిదైన రోమీయులకు వ్రాసిన పత్రిక రోమా సంఘానికి రాసిందే. అయితే ఇది స్థాపించబడ్డ 400 సం॥ల తర్వాత అందులో అనేక మార్పులు జరుపబడి తన మొదటి స్థితిని పూర్తిగా కోల్పోయింది. ఒక భయంకర దుర్బోధగా మిగిలింది.
ఇప్పుడు రోమా సంఘ చరిత్ర తెలుసుకుందాం:
ప్రారంభంలో ఎంతో అద్భుతమైన భక్తి చేసి, సేవలో ఎంతో సహకరించి, ఎన్ని శ్రమలు వచ్చినా వాక్యం కొరకు నిలబడింది రోమా సంఘం. క్రీ.శ 312 లో కాన్స్టాంటైన్ చక్రవర్తి మేగ్జింటియనున్ను యుద్ధంలో గెలిచి రోమా సామ్రాజ్యం మొత్తాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆ యుద్ధంలో గెలుపుకి కారణం యేసుక్రీస్తేనని కాన్స్టాంటైన్ నమ్మాడు. దానితో క్రైస్తవులకి స్వాతంత్య్రంతో పాటు సువార్తకి కావలసిన ధనం, సువార్తికులకి నివాసాలు, చర్చిలు, పన్నులలో రాయితీలు, క్రైస్తవులకు ప్రభుత్వోద్యోగాలు, అధికార పదవులు ఇలా అనేక
సౌకర్యాలని కలిగించాడు. ఈ సౌకర్యాలకి ఆశపడిన సామాన్య జనులు తమ పాపాల్ని ఆచార సాంప్రదాయాల్ని వదలకుండానే మారుమనస్సు పొందకుండానే బాప్తీస్మాలు తీసేసుకుని క్రైస్తవులుగా మారిపోయేవారు. సంఘంలో మొదటిసారిగా నామకార్ధ క్రైస్తవులు చేర్చబడ్డారు.
క్రైస్తవ్యానికున్న గొప్పవిలువ, నిజక్రైస్తవుల సంఖ్య ఘోరంగా తగ్గిపోయింది. సేవకులు అధికారాలపై ఆశలు పెంచుకుని సుఖభోగాలకు అలవాటుపడ్డారు. తాము గొప్పవారమని అందరూ తమని గౌరవించాలని, విస్తారమైన కానుకలు సంఘానికి తేవాలని బోధించసాగారు. సత్యవాక్యాన్ని సూటిగా బోధించడం మానేసారు. అనేకమంది ఫాదర్లు, బిషప్పులు త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, తిండిబోతులుగా,
మారిపోయి సంఘాన్ని సక్రమంగా నడిపే బాధ్యతని నిర్లక్ష్యం చేసారు. క్రీ.శ 400వ సంవత్సరం దాటేసరికి తాము పూజించే యేసు రూపాన్ని ఊహించి చిత్రపటాలు గీయడం ప్రారంభించారు. యేసు చిత్రపటాల్ని, విగ్రహాల్ని తయారు చేసి సంఘంలో పెట్టి వాటిని పూజించేవారు.
ప్రపంచంలో ఉన్న రోమా అనుబంధ సంఘాలన్నింటిలోనికి యేసు విగ్రహాలు ప్రవేశించాయి. విగ్రహారాధన మహాపాపంగా bible చెప్తున్నా బాధ్యత లేని వ్యసనపరులైన ఆనాటి బిషప్పులు ఆ దుష్క్రియను ఖండించకుండా ఆహ్వానించారు.
ప్రపంచమంతా రోమన్ క్యాథలిక్ సంఘం ఒక్కటే ఉండేది.
రోమ్లో ఉన్న మూల సంఘం ఏం చెప్తే మిగతా సంఘాలు అవి పాటించాలి.
క్రీ.శ 430 లో ప్రపంచమంతా విస్త్రుతంగా రోమన్ క్యాథలిక్ సంఘాన్ని వ్యాప్తి చెందించాలని ఆ శాఖ అధ్యక్షులంతా నిర్ణయించుకున్నారు.
ఎఫెసీలో విగ్రహారాధన చాలా ఎక్కువ. వారొక దేవతని పూజించేవారు. ఆమె పేరు 'ఆర్తెమి' (డయానా). ఆమెని సకల దేవుళ్ళకి దేవతలకి మహాతల్లిగా వారు ఆరాధించేవారు (అపో.కా. 19:24). ఆ ప్రాంతంలో వారి శాఖల్ని ఎక్కువ సంఖ్యలో స్థాపించి అక్కడున్న వారందర్నీ వారి
సంఘంలోనికి కలుపుకోవడానికి ఆ ఆర్తెమిదేవే యేసు తల్లి అయిన మరియ అని బోధించడం మొదలు పెట్టారు.
ప్రపంచంలో ఉన్న అన్ని ఇతర క్యాథలిక్ అనుబంధ సంఘాల్లోకి ఈ వార్త పంపించేశారు. అన్ని సంఘాల్లోను యేసు విగ్రహంతో పాటు మరియ విగ్రహం పెట్టబడింది. బైబిల్ను పక్కనపెట్టి వారికి తోచిన పద్ధతులు ప్రవేశపెట్టారు. వాటన్నిటినీ క్యాథకిజం అనే పుస్తకంగా రాసారు.
-------------------------------------------------------------------------------------------------------------------------
Buy Here : https://amzn.to/4dr27WI
క్యాథలిక్ వారికి కొన్ని సిద్ధాంతాలు పాటించేవారు అవి ఇప్పుడు చూద్దాం:
1.చిన్న పిల్లలకి జ్ఞానస్నానం లేదా బాప్తిస్మం ఇవ్వడం:అంటే చిన్న పిల్లలకే బాప్తీసపాన్ని ఇచ్చేవారు
*నిజానికి దేవుడు బాప్తిసం పొందడానికి కొన్ని షరతుల్ని పెట్టాడు. అవి1. (మార్కు 16:16,అపో.కా. 8:12, 18:8) ప్రకారం యేసుక్రీస్తు నందు విశ్వాసముంచాలి 2.(అపో.కా. 2:38) ప్రకారం మారుమనస్సు పొందాలి
*అంటే యేసు దేవుని కుమారుడని, ఆయన మాత్రమే రక్షించగలడని విశ్వసించాలి. గత కాలపు పాపములు విడిచి పశ్చాత్తాపము పొంది హృదయ పరివర్తన పొందాలి. బాప్తీస్మం పొందటానికి అతి ముఖ్యమైన నియమాలివి.
*అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఒక పసిపిల్లవాడికి యేసే దేవుడని తెలుస్తుందా? క్రీస్తునందు విశ్వాసముంచుతాడా? (రోమా 10:9) ప్రకారం ఒకడు రక్షించబడాలంటే హృదయమందు విశ్వసించి
నోటితో ఒప్పుకోవాలి కదా. ఆ పసిబిడ్డ అది చెయ్యగలడా? ఒక పసిపిల్లవాడు పాపాలను ఒప్పుకుంటాడా? మారుమనసు
పొందనివాడికి తన పాపాలు ఒప్పుకోనివాడికి బాప్తీస్మమివ్వకూడదు.అలా ఇస్తే అది వాక్య విరుద్ధం అవుతుంది కదా.
2.చిలకరింపు బాప్తిస్మము:
గ్రీకు బైబిల్లో బాప్తిస్మము అనే పదమును ట్రాన్స్లేట్ చేసేటప్పుడు Baptizo అనే పదాన్ని ఉపయోగించారు. ఈ మాటకు ఇంగ్లీష్లో dip, immerse, sub-merge, plung అనే అర్ధాలు వస్తాయి. తెలుగులో పాతిపెట్టబడుట, ముంచుట, తలను నీటిలో ముంచుట, పూర్తిగా పాతిపెట్టబడుట, ద్రవంలోనికి లోతుగా ముంచుట మొదలైన అర్ధాలు వస్తాయి. నీటిలో ముంచడమే బైబిల్ చెప్తున్న బాప్తిస్మము. అందుకే యేసుక్రీస్తు బాప్తీస్మంపొంది నీటినుండి వెంటనే వెలుపలికి వచ్చెను. నాలుగు చుక్కలు నీరు జల్లించుకోవడానికి నదిలో దిగడం దేనికి?
యోహాను 3:23
సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి.అని చూస్తా0
*ఇతియోపియా నపుంసకుడు బాప్తీస్మము పొందిన సందర్భం మనకి మరింత రూడీ చేస్తుంది. అపో.కార్యములు 8:36
వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. అని చూస్తా0.
ఫిలిప్పు, నపుంసకుడు రధంలో పయనిస్తుండగా నీరుగల ప్రదేశం కన్పించి ఆగిరి.
*ఆ నపుంసకుడు ప్రయాణం చేస్తుండగా త్రాగడానికి నీరు ఖచ్చితంగా తీసుకెళ్తాడు. చిలకరింపు బాప్తీస్మముకి అవి చాలు కదా! కాని నీరు గల ప్రాంతానికి వచ్చి “ఇదిగో నీరున్నది కదా, నేను బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి" అన్నాడు.
*ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అని చూస్తా. చిలకరించుకొని బాప్తీస్మము పొందడం కోసం నీటిమడుగు లోపలకి దిగి వస్త్రాలన్నీ తడుపుకునేవారు కాదు కదా.
3.మరియకు ప్రార్ధన చేయుట:
యేసుని శిష్యులు ప్రార్ధన ఎలా చెయ్యాలని అడిగినప్పుడు మత్త 6:9,10లో ఆయన స్వయంగా దేవునికి చెయ్యాలని నేర్పించాడు. కానీ మరియకి చెయ్యమని చెప్పలేదు. బైబిల్లో ప్రతీ చోటా యేసునామంలోనే ప్రార్ధించమని చెప్పబడింది. మరియా లేక చనిపోయిన భక్తుల పేరిట ప్రార్ధించమని లేదు. బైబిల్లో ఎవరూ తల్లి అయిన మరియా నామంలో ప్రార్ధించలేదు.
![]() |
4.మనుష్యులను మధ్యవర్తులుగా చేసుకొనుట:
దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసను నరుడు 1తిమో 2:5లో ఇంత స్పష్టంగా దేవుడు చెప్తున్నా రోమన్ క్యాథలిక్ వారు ఎప్పుడో చనిపోయినవారిని మధ్యవర్తులుగా భావిస్తారు. చనిపోయిన పోప్ లను, మరియాను మధ్యవర్తులుగా భావించి తమ విజ్ఞాపనలను వారికి తెలియజేస్తుంటారు.
5.వీరు పది ఆజ్ఞలను మార్చేసారు.
రోమన్ క్యాథలిక్ సంఘం వారు దేవుడు తన చేతితో రాసిన పది ఆజ్ఞలను వీరి తప్పుడు సిద్ధాంతాలకి అనుకూలంగా సవరించేసుకున్నారు.
వారి సిద్ధాంతాల్ని నిజం చేస్కోడానికి వారెంతటికైనా తెగిస్తారని తెలుసుకోవడానికి ఇదొక మచ్చుతునక.
దేవుడు రాసిన పదిఆజ్ఞలు చూస్తే:
1.నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరోక దేవుడు ఉండకూడదు
2. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద ఉండు నీళ్లయందే గాని ఉండు దేని రూపాన్ని రూపమునైన విగ్రహమునైన నీవు పూజింపకూడదు సాగిలపడకూడదు
3. మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నచ్చరింపకూడదు.
4. విశ్రాంతి దినమును ఆచరించాలి. etc..
*ఇవి దేవుడు స్వయంగా తన చేవ్రాతతో రాసి ఇశ్రాయేలీయులకి విధించిన కట్టడలు.
ఇప్పుడు క్యాథలిక్ వారు రాసిన పదిఆజ్ఞలు చూద్దాం:
1. సర్వేశ్వరుని మాత్రము ఆరాధింతువు గాక
2. సర్వేశ్వరుని నామమును వ్యర్థంగా పలుకకయుందువు
3. సర్వేశ్వరుని పండుగ దినములు పరిశుద్ధపరచుదువుగాక
4. తల్లిదండ్రులను గౌరవించుదువుగాక
తమ విగ్రహారాధనకి వ్యతిరేకంగా ఉన్న దేవుని మాటని ఎలా మార్చేసారో చూడండి..
6.ఉత్తరించు ఆత్మలు గల స్థలం:
చనిపోయిన తరువాత పరిశుద్ధులయితే నేరుగా పరలోకానికి వెళ్ళిపోతారు. యేసుని నమ్మని వారునేరుగా నరకానికి వెళ్ళిపోతారు. కానీ యేసుని తెలుసుకుని కూడా పాపం చేసినవారు మాత్రం ఈ ఉత్తరించు స్థలం లోనికి వెళ్తారు. అక్కడ వారుండగా, వారి పాపాల నిమిత్తం శ్రీసభకి ధనాన్ని కానుకగా ఇచ్చిన వెంటనే ఆ ఆత్మ ఉత్తరించు స్థలం నుండి పరలోకం వెళ్ళిపోతుంది ఇదీ వీరి సిద్దాంతం.
*అసలు ఉత్తరించు స్థలం ఒకటుందని వాక్యం చెప్తుందా? అసలు అలాంటి మాటే బైబిల్లో లేదు. పరలోకం పరదైసు, నరకం పాతాళం తప్ప ఆత్మలుండే ఇంకో చోటు ఎక్కడా లేదు. డబ్బు సంపాదించడానికి పోప్ లు, ఫాదర్లు కలసి ఈ స్థలాన్ని ఏర్పాటు చేసారు.
---------------------------------------------------------------------------------------------------------------
7.Aడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తన చేయాలి:
*పాప సంకీర్తనంటే ఫాదర్ దగ్గరకి వెళ్ళి చేసిన పాపాలను ఒప్పుకుని ఆ పాపాలు పరిహరింపబడటానికి ఫాదర్ నియమించిన అపరాధ రుసుముని కట్టాలి. అప్పుడు ఆ పాపాలు క్షమించబడతాయి. '
8. మరియా యోసేపుకు యేసు ఏకైక సంతానం:
*కన్య మరియు యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను (మత్త1:24,25) చూస్తా0
మరియను స్వీకరించి యేసు పుట్టే వరకూ ఆమెతో శారీరక సంబంధం కలిగిలేడు అంటే యేసు పుట్టాక సంబంధం కలిగి ఉన్నాడనేకదా దీనికర్ధం. యేసు పుట్టిన తర్వాత కూడా వారు ఏకం కాకపోతే యోసేపు తన వంశం కోసం మరో వివాహం చేసుకునేవాడు. అలా చెయ్యలేదు. క్రీస్తు పుట్టిన తర్వాత మరియకు నలుగురు కుమారులు పుట్టారు. అందుకే యోసేపు మరో వివాహం చేసుకోలేదు. అవును మరియ యోసేపులకు మత్త 13:55, మార్కు 6:3 కుమారులు పుట్టినట్టు చూస్తాం వారే యాకోబు, యోసేపు, యూదా, సీమోను అని వారు.
*యాకోబు యేసుకి స్వంత సహోదరుడు కాబట్టే పౌలు క్రీస్తుని గూర్చి తెలుసుకోవాలనే ఆశతో యాకోబును కలిసాడు. క్రొత్త నిబంధన పత్రికల్లో యాకోబు పత్రిక రాసింది యేసు తమ్ముడైన యాకోబే.
9ఆదివారమున, పండుగల రోజున శరీరం కష్టమైన పనులు చెయ్యకూడదు.
10. పండగలు ఆచరించుట:
మట్టలాదివారం, విభూది బుధవారం, లెంట్ డేస్, గుడ్ పైడే, ఈస్టర్, క్రిస్మస్, త్రిత్వ పండుగ, మరియా పవిత్ర జననం, మరియు ఆరోహణ దినం ఇలా ఎన్నో లోక సంబంధమైన పండగలు పద్ధతులను రోమన్ క్యాథలిక్కులు ప్రవేశపెట్టారు.
Protestant christianity :
*1507 లో మార్టిన్ లూథర్ రోమన్ క్యాతోలిక్ చర్చ్ లో “బోధకుడిగా” నియమితుడై అందరిలా బైబిల్ ని క్యాతోలిక్ కోణంలో కాకుండా పూర్తి పరీశీలన చేసి, నాటి మతపెద్దలు బోధిస్తుంది తప్పు అని చెప్పాడు, బైబిల్ కి విరుద్ధంగా ఉన్న వారి అధికారాలు , బోధనలను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ చేసాడు, అలా అప్పుడు ప్రారంభమైందే ప్రొటెస్టెంట్ క్రైస్తవ్యం...
*కేథలిక్ బోధకులు ప్రజల్ని నియంత్రిస్తూ ,బైబిల్ కు వ్యతిరేకంగా బోధించడం వల్ల వేలమంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులు వ్యతిరేకించారు దాంతో నాటి రోమన్ క్యాథలిక్ సంఘం వారిని చంపేసింది. వీరినే ప్రొటెస్టంట్లు అంటారు.
*బైబిల్ పై, క్రైస్తవ్యం పై సర్వ హక్కులు తమకే కలిగి ఉన్నట్టుగా బైబిల్ బోధనలు చేసే అధికారం కేవలం క్యాతోలిక్ మతపెద్దలు మాత్రమే కలిగి ఉండి ఇతరులకు బైబిల్ ని చదివే అవకాశాన్ని కల్పించేవారు కాదు. వారు చెప్పిందే వేదం. కాదన్న వారిని దైవ ద్రోహులుగా చిత్రీకరించేవారు. అయితే తర్వాత కాలంలో మార్టిన్ లూథర్ గారు బైబిల్ ని ట్రాన్స్లేషన్ చేయడం ద్వారా అనేకున్ని బైబిల్ ని చదివి నిజా నిజాలు తెలుసుకున్నారు.
కాలక్రమేణా బైబిల్ కి వ్యతిరేకంగా ఉండే రోమన్ క్యాథలిక్ పద్ధతులు, ఆచారాలెన్నింటినో ఇప్పటి ప్రొటెస్టెంట్లు కూడా పాటిస్తున్నారు. కాబట్టి మనం వారిలా ఉండకుండా లోక సంబంధమైన ఆచార వ్యవహారాలని విడిచిపెట్టి ఆత్మీయకంగా ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్....
Watch this topic on YouTube channel
0 Comments