యేసుక్రీస్తు వివాహితుడా ? || Was Jesus Christ married ?
1 మానవుల రక్షణార్థం సిలువపై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు
*ప్రపంచములో ఎక్కువ మందిని ప్రభావితం చేసిన ప్రభావశిలిగా పేరున్నది ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే. ప్రపంచ జనాభా సుమారు700 కోట్లు ఉంటే అందులో ఎక్కువ శాతం మంది యేసును రక్షకుడిగా,ప్రభువుగా విశ్వసిస్తున్నారు.
*అయితే ఆ మధ్య కాలంలో కాప్టిక్ భాషలో రాసివున్న అత్యంత పురాతన పత్రమొకటి దొరకడంతో యేసుక్రీస్తు వారు మగ్దలేనే మరియని వివాహం చేసుకున్నారని వారికి పిల్లలు పుట్టారని విపరీతంగా ప్రచారం చేస్తూ వీటిపై అనేక పుస్తకాలు రాస్తూ డిబేట్స్ జరిగాయి మూవీస్ కూడా తీశారు.
*అయితే నిజంగా ఏసుప్రభుల వారు మద్దలేని మరియను వివాహం చేసుకున్నారా? వాటికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏసుప్రభువు వారికి వివాహం అయిందని ప్రచారం ఎలా మొదలైంది? ఆ పురాతన Papyrusలో ఏముంది? Last supper paintingకీ, Leonardo davinci నవలకి & Last gospel bookకీ, ఏసుప్రభుల వివాహనీకీ సంబందం ఏంటీ? చారిత్రాత్మకంగా లేదా బైబిలు ప్రకారం ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వీటన్నిటి గురించి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు చూడండి..
*ముందుగా మీకు రిక్వెస్ట్ ఈ Blog కొంచం Lengthyగా ఉంటుంది But మొదటి నుండి చివరి వరకి Compulsoryగా చూడండి మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు ఈ Topic మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఇలాంటి విషయాలు ఇంక అనేకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి దాని ద్వారా మీ ముందుకి ఇంకా అనేక Topics ని తీసుకురాగలుగుతాం.
2. ప్రపంచములో ఎక్కువ మంది తమ రక్షకుడిగా, దేవునిగా భావించి విశ్వసించి ,అయన మాటలానుసారముగా నడుస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇంత మంది మనోభావాలను దేబ్బదిస్తూ వ్రాసిన పుస్తకమే ధీ లాస్ట్ గాస్పెల్(THE LAST GOSPEL).
*ఐదవ శతాబ్దములో దొరికిన చిన్న ముక్కలో ఉన్న మాటలను బట్టి క్రీస్తునకు మగ్దలేనే మరియతో అక్రమ సంభందాన్ని అంటకట్టారు. వాస్తవముగా యేసు జీవించిన కాలము మొదటి శతాబ్దము. వీరికి దొరికిన papyrus ఐదవ శతాబ్దములోనిది. అంటే యేసు మరణించిన ఐదు వందల సంవత్సరాలకు సంబంధించిన పేపర్ ముక్కను చూసి యేసుకు వివాహం అయ్యింది అని ఉహించి వ్రాసిన పుస్తకము ధీ లాస్ట్ గాస్పెల్.
*బార్రి విల్సన్ & సించ జాకోబోవీచి, రచించిన THE LAST GOSPEL పుస్తకములో యేసుకు మగ్దలేనే మరియతో వివాహం అయ్యినట్టుగా, వారికీ ఇద్దరు పిల్లలు పుట్టినట్టుగా చిత్రీకరించి, డావించీ కోడ్ అనే నవల ద్వారా ప్రేరణను పొంది వ్రాసారు.. యేసుక్రీస్తు వివాహితుడు అనే తప్పుడు కధనాన్ని అనేక తెలుగు, ఇంగ్లీష్ వార్త పత్రికలలో ప్రచురం చేశారు.
3. అసలు ఏసుప్రభుల వారు వివాహం చేసుకున్నారని వివాదం ఎలా మొదలైందో Leonardo da vinci నవలలో ఏముంది ఇప్పుడు తెలుసుకుందాం
*ఏసుప్రభుల వారు వివాహం చేసుకున్నారని వివాదం మొదలవడానికి కారణం Leonardo da vinci painting. ఈ వివాదం అక్కడి నుండే మెుదలైంది. ఆ Painting వేసీనప్పటి నుండి ఇప్పటి వరకీ ఎం జరిగిందో Clearగా తేలుసుకుందాం.
*లీనాడో డావిన్సీ గురించి తెలియని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలోనే ది బెస్ట్ పెయింటర్. ఏసుక్రీస్తు వారిని శిలువ వేసే ముందు తన 12మంది శిష్యులతో కలిసి ఒక విందులో పాల్గొంటారు దాన్ని ఆధారంగా చేసుకుని లీనాడో డావిన్సీ ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు దాని పేరే ది Last supper.
*ఈ లాస్ట్ సప్పర్ పెయింటింగ్ మనకు మ్యూజియంలో కనిపించదు ఇటలీలోని మిలాన్ లో శాంత మరియా ఢిల్లీ గ్రీజీ అనే కాన్వెంట్ లోని డైనింగ్ హాల్ గోడమీద 15వ శతాబ్దంలో డావెన్సీ ఈ బొమ్మని గీశాడు ఇది మనం అనుకునే దాని కంటే చాలా పెద్దగా ఉంటుంది దీన్ని వేయడానికి డావెన్సీ కి మూడు సంవత్సరాలు పట్టింది
*బైబిల్లోని యోహాన్ సువార్త 13వ అధ్యాయం 21 వచనము ఆధారంగా తీసుకొని ఈ బొమ్మని గీశాడు ఈ వచనములో ఏసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో మీలో ఒకడు నన్ను రొమాన్స్ కి అప్పగిస్తాడు అని చెప్తాడు అయితే జీసస్ తనని ఒకరు పట్టిస్తారని చెప్పిన తర్వాత శిష్యుల రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఊహించుకొని గీసిన పెయింటింగ్ ఇది. మనం ఈ పెయింటింగ్ ని బాగా గమనిస్తే వారి ఫేసెస్ ఆందోళన బాగా కనిపిస్తుంది బైబిల్ ప్రకారం ది లాస్ట్ సప్పర్ లో అందరూ సర్కిల్లో కూర్చుంటారు కానీ డావెన్సీ గీసిన పెయింటింగ్లో అందరూ ఒక లైన్ లో కూర్చుంటారు దానికొక రీజన్ ఉందని కొంతమంది చెప్తారు
*డావెన్సీ పెయింటింగ్ వెయ్యక ముందు కొన్ని వందల లాస్ట్ సప్పర్ పెయింటింగ్స్ ఉన్నాయి అవన్నీ ఫేమస్ కాదు అందుకే వాటి గురించి మనకు తెలియదు డావెన్సీ పెయింటింగ్ వేయడానికి వాటిని రిఫరెన్స్ గా తీసుకున్నాడు ఆ పెయింటింగ్స్ కి ఈ పెయింటింగ్స్ కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి
*ఈ పెయింటింగ్ మీద అనేకమంది చాలా పరిశోధనలు చేసి అనేక పుస్తకాలు రాశారు అందులో ముఖ్యంగా Dan brown అనే హిస్టారికల్ ఫిక్షన్ నవల రచయిత, ఈ పెయింటింగ్ లోని అనేక సీక్రెట్స్ ని ప్రస్తావిస్తూ డావెన్సీ కోడ్ అనే Novel రాశాడు.
*బైబిల్ ప్రకారం ఏసుక్రీస్తు 12 మంది శిష్యులతో విందులో పాల్గొన్నప్పుడు జీసస్ కి రైట్ సైడ్ లో కూర్చుంది జాన్ the apostle కానీ డావిన్సీ బుక్ రచయిత డాన్ బ్రౌన్ ప్రకారం జీసస్ కి రైట్ సైడ్ లో కూర్చుంది జాన్ కాదు మద్దలేని మరియా అనే స్త్రీ. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 2003లో డాన్ బ్రౌన్ గారి నవల The Da Vinci Code విడుదలైంది.
4.. తన వాదన రుజువు చేయడానికి తన వద్ద బలమైన కారణాలు ఉన్నాయి అంటున్నాడు డాన్ బ్రౌన్. ఈ లాస్ట్ సప్పర్ పెయింటింగ్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను అందులో ఈ డాన్ బ్రౌన్ చెప్పిన కారణాలని తెలుసుకుందాం
*లాస్ట్ సప్పర్ Painting లో ఆ రైట్ సైడ్ ఉన్న వ్యక్తి మెడలో మాత్రమే ఒక చిన్న నెక్లెస్ లాంటిది ఉంటుంది ఇక ఎవరి మెడలో అలాంటిది ఉండదు అతన్ని కొంచెం ఆడ మనుషులా ఉండడానికి గీశాడు ఏసుక్రీస్తు వారి శిష్యులందరిలో జాన్ చాలా చిన్నవాడు. అన్ని పెయింటింగ్స్ లో జాన్ జీసస్ పక్కనే ఒక వైపు వాలిపోయి ఉంటాడు. అందరిలో చిన్న age కాబట్టి చూడటానికి కొంచెం ఆడవారిలాగే కనిపిస్తాడు దాంతో జీసస్ పక్కన కూర్చుంది జాను కాదు మద్దలేని మరియ అని డాన్ బ్రౌన్ అనె రచయిత The DaVinci code అనే బుక్కు వ్రాశాడు.
*బైబిల్లో వేశ్యగా పేర్కొనబడిన మేరీ మద్దల్లిని ఏసుప్రభుల వారు పెళ్లాడిన్నట్లు ఆ పుస్తకంలో చెప్పబడింది. ద డావిస్ కోడ్ విడుదల చేసినప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. కాని ఇందులో చాలా వాదనలు అవాస్తవాలుగా ఉన్నాయని పరిశోధకులు దీన్ని ఒక జోక్ లా కొట్టి పడేశారు. అయితే కొంతకాలం గడిచాక బ్రిటిష్ గ్రంథాలయంలోని అరల్లో ఈజిప్షియన్ కాప్టిక్ భాషలో రాసివున్న అత్యంత పురాతన పత్రమొకటి దొరకడంతో క్రీస్తు, మగ్దలీనాల గురించి చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. నిజానికి చరిత్రలో ఏసుక్రీస్తు జీవితంపై వివాదాలు కొత్తేమి కాదు.
5. కాప్టిక్ భాషలో రాసివున్న పురాతన పత్రం అయినా gospel of jesus wife Papyrus fragmentలో ఏముంది? అది అసలు ఎక్కడి నుండి ఎలా బయటికి వచ్చింది దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం?
* 2012 రోమ్ నగరంలో జరిగిన ఒక సమావేశంలో, హార్వర్డ్ డివినిటీ స్కూల్ లో ప్రొఫెసర్ గా పని చేసున్న చరిత్రకారిణి. "Harvard’s Hollis Chair of Divinity" ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ అయినా కారెన్ లీ కింగ్ (Karen Leigh King) గారు ఒక సంచలన ప్రకటన చేశారు. తన దగ్గర ఉన్న ఒక ప్రాచీన "Papyrus fragment" ని, అందరికీ చూపించారు. ఆ చిన్న పేపర్ ముక్కలో, ప్రాచీన ఈజిప్షియన్ కాప్టిక్ భాషలో వ్రాయబడిన చిన్నపాటి పత్రంలో మొత్తం ఎనిమిది లైన్లు ఉండగా, ఇందులో నాలుగో లైనులో.. "జీసస్ వారితో చెప్పాడు.. నా భార్య" అని ఉంది. ఐదో వరుసలో "ఆమె నా శిష్యురాలిగా ఉండగలదు" అని చెప్పినట్టుగా ఉంది. మరికొన్ని వరుసల తర్వాత "నేను ఆమెతో కలిసి నివశిస్తున్నాను" అని ఉంది. దాంతో ఈ papyrus సంచలనం సృజించింది
* ఒక ఎటిఎం కార్డు సైజు కంటే కూడా చిన్నగా ఉన్న ఈ “fragment” కి కారెన్ లీ కింగ్ పెట్టిన పేరు - “The Gospel of Jesus’s Wife”. యేసు క్రీస్తు యొక్క భార్య సువార్త అనేది, పెద్ద పుస్తకమేమి కాదు. ఇందులో బోలెడు అధ్యాయాలు గానీ, బోలెడు వచనాలు గానీ ఏమీ లేవు. ఇది కేవలం ఒక చిన్న tiny fragment మాత్రమే.
*యేసు క్రీస్తుకి పెళ్లి అయ్యింది అని ఖచ్చితంగా నిరూపించే ప్రాచీన లేఖనాలు ఏవీ కూడా అంతకు ముందు వరకు లభించలేదు. ఈ పత్రంలో ఉన్న వాక్యాలు అసంపూర్తిగా ఉన్నప్పటికీ, యేసు ప్రభువు తన భార్య కూడా ఒక శిష్యురాలిగా ఉండుటకు అర్హురాలు అని, మిగతా శిష్యులకు చెబుతున్నట్టుగా ఇందులోని వాక్యాలున్నాయి.
*మరి ఈ చిన్న "fragment" ఆధారంగా యేసు ప్రభువుకి పెళ్లి అయ్యింది అని మనం చెప్పొచ్చా? లేదు చెప్పలేం. యేసు ప్రభువుకి పెళ్లి అయ్యింది అనడానికి ఈ fragment ని ఆధారంగా తీసుకోలేము అని స్వయంగా కారెన్ లీ కింగ్ గారు కూడా అభిప్రాయపడ్డారు. కారణం- ఇది ప్రత్యక్ష సాక్షులు రాసింది కాదు. యేసు ప్రభువు యొక్క శిష్యులు రాసింది కాదు. ప్రత్యక్ష సాక్షుల నుండి వివరాలు సేకరించి రాసింది కూడా కాదు. యేసు ప్రభువు ఈ భూమి మీద జీవించిన తరువాత కొన్ని వందల సంవత్సరాలకి కాప్టిక్ భాషలో ఇది వ్రాయబడింది. కాబట్టి దీనిని ఆధారంగా తీసుకోలేము. అయితే, ఈ “manuscript” ని ఆధారం చేసుకొని, ఆ రోజుల్లో కొంతమంది యేసు ప్రభువుకి పెళ్లి అయ్యింది అని నమ్మేవారని మాత్రం చెప్పొచ్చు అనేది కారెన్ లీ కింగ్ గారి అభిప్రాయం.
* అయితే Gospel of jesus wife రాతప్రతి దొరకడంతో ఏసుక్రీస్తు బ్రహ్మచారి అవునా కాదా అనే అంశంపై చర్చ మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటివరకు జీసస్ వివాహమైనట్టు నిరూపించాలని ప్రయత్నం జరిగినప్పటికీ వారి దగ్గర ఏం ఎవిడెన్స్ లేకపోవడంతో వాటిని జోగ్ కొట్టి పరేశారు అయితే ఈ జీసస్ వైఫ్ అనే papyrus దొరకడంతో ఇదే ఛాన్స్ అని జీసస్‌ని మేరీ మాగ్డలీన్ భర్తగా చూపిస్తూ last gospel అనే బుక్కుని రాశారు.
*లాస్ట్ గాస్పెల్ అనేది జీసస్‌ని మేరీ మాగ్డలీన్ భర్తగా చూపించే మరో ప్రయత్నం.
6. Gospel of jesus wife రాత ప్రతికి The last gospel పుస్తకానికి సంబంధం ఏంటి? The last gospel పుస్తకం ఎలా రాయబడింది ఇప్పుడు చూద్దాం
*హిస్టరీ ఆఫ్ జాక్రియస్ రేటోర్ అనే పేరుతో శుద్ధి చేసిన జంతు చర్మం మీద వ్రాయబడ్డ ఒక పాత పుస్తకానికి అనువాదమే ది లాస్ట్ గాస్పెల్
* 6th-century author సూడో-జకారియాస్ రెటోర్ అనే ఆయన ఎక్లేసియస్టికల్ హిస్టరీ ఆఫ్ జాక్రియస్ రేటోర్ అనే బుక్ ని రాశారు.
*హిస్టరీ ఆఫ్ జాక్రియస్ రేటోర్ అనే ఈ పాత పుస్తకంలో జోసెఫ్ మరియు అసెనెత్ అనే వారి స్టోరీ రాయబడింది. జోసెఫ్ మరియు అసెనెత్ కథ చాలా పురాతనది.
*జోసెఫ్ అనే ఆయనకు పోతిఫరు కుమార్తె అయిన అసెనత్ అనే మహిళకు వివాహం చేశారని తర్వాత వారికి ఇద్దరు కుమారులు పుట్టారని ఇందులో రాయబడింది
*ఇదే స్టోరీ ఆదికాండము 41:45లో చూస్తే ఫరో యోసేపునకు, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను. అని బైబిల్లో చూడొచ్చు.
*1847లో బ్రిటిష్ మ్యూజియం వారు ఈజిప్షియన్ మొనాస్టరీ నుండి ఎక్లేసియస్టికల్ హిస్టరీ ఆఫ్ జాక్రియస్ రేటోర్ book కొనడంతో ఈ పుస్తకం ఇంగ్లాండుకు చేరింది జంతు చర్మం మీద సిరియాంకు/అరమైక్ భాషలో రాసిన ఆ ప్రతి బ్రిటిష్ గ్రంధాలయంలో 20 ఏళ్ల నుంచి ఉంది.
*చాలామంది పండితులు దాన్ని చదివాక పెద్దగా పసలేదని వదిలేశారు కానీ ది లాస్ట్ గాస్పెల్ రచయితలు ప్రొఫెసర్ బార్రి విల్సన్ & సించ జాకోబోవీచి అనే ఇద్దరు నార్త్ అమెరికన్స్ మాత్రం అరమైక్ లిపి నుండి ట్రాన్స్లేషన్ చేసి 6సంవత్సరాలు పరిశోధించి
*ఈ బుక్ లో రాయబడింది జోసెఫ్ మరియు అతని ఈజిప్షన్ భార్య గురించి కాదు ఇది రాయబడింది మేరీ మద్దాలిన్ మరియు యేసు గురించి రాయబడిందని చెప్పారు
*అ కాలపు పరిస్థితుల వల్ల ఇలా రహస్య సందేశంగా జీసస్ మరియు మేరీ మాగ్డలీన్ పేర్లకి బదులు జోసెఫ్ మరియు అసెనెత్‌లు అని వ్రాయబడిందని ఆ బుక్ లో రాసిన స్టోరీ జీసస్ story అని జాకోబోవిసి మరియు విల్సన్ చెప్పారు
Click here to Buy - https://amzn.to/40L2B5w
-------------------------------------------------------------------------------------------------------------------
*అక్కడ రాయబడింది జీసస్ స్టోరీ అని ప్రూవ్ చేయడానికి వారు ఏం చెబుతున్నారంటే
*బైబిల్లో యేసుక్రీస్తు ఎనిమిది రోజుల వయస్సు నుండి, ముప్పై సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అనగా శిలువ వేయడానికి మూడు సంవత్సరాల ముందు ఆయన తన సేవను ప్రారంభిస్తారు సేవ ప్రారంభించే వరకు ఆయన గురించి బైబిల్లో ఏం రాయబడలేదు మద్యలో పన్నెండు సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులతో కలిసి పస్కా పండుగను జరుపుకోవడానికి జెరూసలేంకు వెళ్లాడని మాత్రం తెలుసు. అయితే యేసు సేవ ప్రారంభించే వరకు ఏమి చేశాడు?
*యేసు క్రీస్తు వారి బాల్యం,విద్య, కుటుంబం, స్నేహితులు, గురించి మనకు ఎటువంటి సమాచారం లేదు. దాంతో క్రీస్తు శకం 575 సంవత్సరాలకు చెందిన gospel of jesus wife రాత ప్రతి ఆధారంగా చేసుకొని జీసస్ సేవ ప్రారంభించే నాటికే ఆయనకు పెళై పిల్లలు ఉన్నారని చెప్పారు
*జోసెఫ్ అతని భార్య అసేనేత్ పాత్రలు నిజానికి జీసస్ మేరిమగ్దాలివేనని యేసు పునరుర్ధానమైన ఐదు వందల సంవత్సరాల తర్వాత రాయబడ్డ ముక్కను చూసి బార్రి విల్సన్ & సించ జాకోబోవీచి అను ఇద్దరు ఉహించి, కల్పించి ధీ లాస్ట్ గాస్పెల్ అనే పుస్తకమును వ్రాసారు.
*జీసస్ పిల్లలిద్దరి పేర్లు, వారికి రోమన్ సామ్రాజ్యంలో శక్తివంతమైన రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయని కూడా ఆ పుస్తకంలో వ్రాయబడింది.
* ధీ లాస్ట్ గాస్పెల్ అను పుస్తకము వ్రాసిన బార్రి విల్సన్ 1940లో & సించ జాకోబోవీచి 1953లో పుట్టాడు వీరు యేసుక్రీస్తు ఉన్నప్పుడు లేరు. యేసును, మగ్దలేనే మరియను కూడ చూడని వారు, ఉహించి ,కల్పించి తప్పుడుగా చిత్రీకరించి యేసు వివాహితుడు అని వారి పుస్తకములో వ్రాసుకుని 2014లో విడుదల చేసారు. అయితే చాలామంది పండితులు ఈ వాదనలన్నీ కూడా పసలేవని కొట్టిపరేశారు.. చూడని వాడి సాక్షం చెల్లదన్న విషయం మనకు తెలిస్తే వీరు ఇద్దరు వ్రాసిన తప్పుడు పుస్తకములోని తప్పుడు మాటలు కూడ అసత్యం అని అర్థమవుతుంది
*కారెన్ లీ కింగ్ గారు మొదటగా ఈ papyrus fragment ని తన సహచరులకు చూపించినప్పుడు కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది నమ్మలేదు.
*తర్వాత కాలంలో ఈ కథను ఆధారంగా తీసుకుని జీసస్ కి పెళ్లయిందా లేదా అనే విషయం మీద చాలా మంది పండితులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వ్యాసాలు, బుక్స్ రాయడం మొదలుపెట్టారు కొందరు జీసస్ నాస్తికుడుగా మారి మేరీ మద్ద లేని వివాహం చేసుకున్ ఫ్రాన్స్ దక్షిణానికి వెళ్లి కొడుకుని కన్నాడని చెప్తే మరికొందరు కాశ్మీర్ వచ్చాడని అక్కడ కాశ్మీరు స్త్రీని పెళ్లాడి పిల్లలకన్నాడని, ఇంకొందరు అయితే జీసస్ వంశావళి అతని కూతురి ద్వారా కొనసాగి మేరో వింజియన్ వంశం ద్వారా ఇప్పటికి నిలిచే ఉందని ఇలా వారికి నచ్చినట్టుగా బుక్స్ రాసేసుకున్నారు
7. అసలు ఇంతకీ ఇది నిజంగా ప్రాచీన పత్రమేనా? తల తోక లేని ఈ చిన్న పేపర్ ముక్కను పట్టుకుని ఇందులో ఉన్న విషయాలు నిజమే అని మనం నమ్మవచ్చా? gospel of jesus wife రాత ప్రతికి నిజమా అబద్దమా? దీని వెనుక ఉన్న నిజానిజాలు లేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*డివినిటీ ప్రొఫెసర్ కారెన్ లీ కింగ్ publish చేసిన ద గాస్పల్ ఆఫ్ జీసస్ వైఫ్ అనే పాపారాస్ గూర్చి ఇది వాస్తవమా లేక బూటకమా అని తెలుసుకోవడానికి ఆర్కియాలజిస్టులు విలేకరులు వారి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు
*Jesus wife, papyrus publish చేయడానికి కొన్ని వారాల ముందు, కారెన్ లీ కింగ్ గారు కొంతమంది వార్తా పత్రికల ప్రతినిధులతో సమావేశమయ్యి, ఈ "fragment" గురించిన విషయాలను వారికి వివరించారు. వారిలో ఏరియల్ సబర్ అనే journalist ఒకరు. ఈ మొత్తం వ్యవహారాన్ని కవర్ చేయడానికి "స్మిత్సోనియన్ మ్యాగజీన్" వారు ఏరియల్ సబర్ ని నియమించారు. స్మిత్సోనియన్ సంస్థ (Smithsonian Institution") అనేది ఏదో చిన్న సంస్థ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కాంప్లెక్స్ ఉన్నాయి. "Gospel of Jesus’s Wife" అనే "fragment" భూటకం అని, చివరికి కారెన్ లీ కింగ్ గారు కూడా ఒప్పుకోవడానికి కారణం, ఏరియల్ సబర్ గారు చేసిన పరిశోధనాత్మక జర్నలిజం.
*2014-2016 వరకు పరిశోధన చేసి 2016లో ఏరియల్ సబర్ గారు అందర్నీ ఆశ్చర్యపరిచే నిజాలని బయటపెట్టారు ఆయన పరిశోధన మొత్తం ఆన్‌లైన్‌లో న్యూస్ పేపర్స్ లో కూడా పబ్లిష్ చేశారు.
*2014లో హార్వర్డ్ థియోలాజికల్ రివ్యూ వాళ్ళు దీనిని "peer reviewers" కి పంపారు. ఈ fragment లో ఉన్న వాక్యాలలో వ్యాకరణానికి సంబంధించిన తప్పులు ఉన్నాయి అని, చేతి వ్రాతలో కూడా తేడాలు ఉన్నాయి అని వాళ్ళు గుర్తించారు. ఇది నిజమైన పత్రమే అయ్యుంటే గనక వ్యాకరణ దోషాలు ఎందుకు ఉంటాయి అనేది ఒక ప్రశ్న. ఇందులోని వాక్యాలు, "గాస్పెల్ అఫ్ థామస్" అనే మరొక కాప్టిక్ "Gnostic Text" నుండి తీసుకుని కాపీ పేస్ట్ చేసినట్లున్నాయి అని మరికొంత మంది గుర్తించారు.
* కీలకమైన విషయం ఏంటంటే, 2002లో "గాస్పెల్ అఫ్ థామస్" ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంచారు. అయితే దాని online edition లో ఒక అచ్చు తప్పు ఉంది. Typographical Error, అంటే టైపింగ్ లో పొరపాటు వలన ఒక చోట తప్పుగా ముద్రణ అయ్యింది. ఆశ్చర్యకరంగా అదే అచ్చు తప్పు "Gospel of Jesus’s Wife fragment"లో కూడా ఉంది. అంటే, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న గాస్పెల్ అఫ్ థామస్ లోని ఒక వాక్యభాగాన్ని తీసుకుని, అందులో అచ్చు తప్పు ఉంది అనే విషయం తెలియక, అదే వాక్యాన్ని వాడుకుని, ఎవరో కావాలని ఈ fragment ని తయారు చేశారు అనే వాదనకు ఇది బలాన్నిస్తోంది.
*కొంతకాలానికి ఈ fragment కి సంబంధించిన కార్బన్ - డేటింగ్ పరిశోధనలు, ముల్టీస్పెక్ట్రల్ ఇమేజింగ్, ఇంకా ఇతర పరీక్షల ఫలితాలను హార్వర్డ్ వారు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో తేలింది ఏంటంటే, ఈ fragment సుమారు క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందినది అని. ఇంకా ఇందులో వాడిన సిరా కూడా పురాతనమైనదే. అయితే వీటిని ఆధారం చేసుకుని, ఈ fragment అసలైనదే అని చెప్పడానికి వీలు లేదు.
click link to BUY - https://amzn.to/40TXFMC
* ప్రాచీన కాలానికి సంబంధించిన ఖాళీ papyrus sheets ని సంపాదించటం పెద్ద కష్టమేమి కాదు. eBay లాంటి సంస్థలు వీటిని తరచూ వేలం వేస్తూ ఉంటాయి. ప్రాచీన కాలంలో సిరా యొక్క తయారీ విధానం గురించి తెలిసిన వాళ్లకి అది తయారు చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు. వీటిని ఉపయోగించి, కాప్టిక్ భాషలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా, నకిలీ పత్రాన్ని సృష్టించే అవకాశం ఉంది. 1980లలో Mark Hofmann అనే వ్యక్తి ఈ విధంగానే పురాతన కాలానికి సంబంధించిన papyrus, సిరా, ఇంకా కొన్ని రకాల రసాయన మిశ్రమాలను ఉపయోగించి నకిలీ పత్రాలను సృష్టించి నిపుణులను సైతం బోల్తా కొట్టించాడు. అతని మోసం బయట పడేలోగా, ఈ నకిలీ పత్రాల ద్వారా ఇరవై లక్షల డాలర్లను సంపాదించాడు. లండన్ లోని "ది బ్రిటిష్ మ్యూజియం", న్యూయార్క్ లోని "ది మెట్రోపాలిటన్ మ్యూజియం అఫ్ ఆర్ట్", పారిస్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం "లోవే" - లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలనే ఫోర్జరీ చేసే వాళ్ళు మోసగించారు అనే విషయం గమనించాలి.
*అందువలన కారెన్ లీ కింగ్ గారికి, ఆమెను విమర్శించేవారికి మధ్య వాదోపవాదాలు జోరుగా సాగాయి. అందరూ కూడా papyrus fragment గురించి, అందులో వాడిన సిరా గురించి, అందులో వ్రాయబడిన వాక్యాలు గురించే పరిశోధనలు చేస్తున్నారు. కానీ, ఏరియల్ సబర్ గారు మాత్రం,
8. అసలు ఈ fragment ఎక్కడి నుండి వచ్చింది? దాని పూర్వాపరాలు ఏమిటి? ఇది ఎవరెవరి చేతులు మారింది? మొట్టమొదటిగా భూమిలో నుండి తవ్వి బయటకు తీసినది ఎవరు? కారెన్ లీ కింగ్ చేతిలోకి రాక ముందు ఈ fragment ఎవరి దగ్గర ఉంది? అనే కోణంలో పరిశోధన మొదలు పెట్టారు.
*ఈ papyri ని కారెన్ లీ కింగ్ కి ఇచ్చిన వ్యక్తి, తన వ్యక్తిగత విషయాలు బయటపెట్టొద్దు అని కోరడంతో ఆ వ్యక్తి గురించి కారెన్ లీ ఎవరికీ చెప్పలేదు. కానీ అతనితో జరిపిన ఇ-మెయిల్ సంభాషణల వివరాలను కారెన్ లీ, ఏరియల్ సబర్ కి పంపించారు. తన దగ్గరకు ఈ papyri ఎలా వచ్చింది అనే విషయాలను ఆ అజ్ఞాత వ్యక్తి ఈ ఇ-మెయిల్స్ లో వివరించారు. అయితే అతను చెబుతున్న విషయాలు పొంతన లేకుండా ఉన్నాయి అని ఏరియల్ సబర్ గారు గుర్తించారు.*ఈ papyrus fragment తన దగ్గరకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చింది అనే దాని గురించి ఈ అజ్ఞాత వ్యక్తి, కారెన్ లీ కింగ్ కి ఒక కథ చెప్పాడు. Hans-Ulrich Laukamp అనే వ్యక్తి 1963లో అప్పటి తూర్పు జర్మనీ దేశంలోని Potsdam అనే పట్టణంలో కొన్ని papyri లను సంపాదించాడనీ, అతని దగ్గర నుండి, 1999లో తాను ఆరు కాప్టిక్ papyri లను కొనుగోలు చేశాననీ, దానికి సంబంధించిన సేల్స్ కాంట్రాక్టు యొక్క ఫొటో కాపీని అతను కారెన్ లీ కింగ్ కి ఇచ్చాడు. ఒరిజినల్ సేల్స్ కాంట్రాక్టు కాకుండా "ఫోటో కాపీని" ఇచ్చిన విషయాన్ని మనం గమనించాలి. అయితే మరొక ఇ-మెయిల్ లో ఈ papyri లను తాను 1997లో కొనుగోలు చేశానని పొంతన లేని మాటలు చెప్పాడు.
*అంతేకాకుండా, జర్మనీ లోని, బెర్లిన్ నగరంలో ఉన్న "ఫ్రీ యూనివర్సిటీలో" ప్రొఫెసర్ గా పని చేసిన egyptologist - పీటర్ మున్రో గారు 1982లో Laukamp కు ఒక ఉత్తరం రాశారనీ, దాని యొక్క ఫోటో కాపీని కూడా ఈ అజ్ఞాత వ్యక్తి కారెన్ లీ కింగ్ కు ఇచ్చాడు. ఆ ఉత్తరంలో ఉన్న దాని ప్రకారం, మున్రో గారి సహచరుడు ఒకరు, ఈ papyri లను పరిశీలించగా, ఒక papyrusలో యోహాను సువార్త లోని వచనాలు ఉన్నట్లు గుర్తించారు. దీనితో పాటు మరొక ఉత్తరం యొక్క ఫోటో కాపీ కూడా ఉంది. ఆ ఉత్తరం ప్రకారం, ఒక చిన్న papyrus fragment లో ఉన్న వాక్యాలను బట్టి, అందులో యేసు ప్రభువు తన భార్య గురించి ప్రస్తావించారనీ, యేసు ప్రభువుకి పెళ్లి అయ్యింది అని అనడానికి ఇది ఆధారంగా ఉపయోగపడుతుంది అని, మున్రో గారి సహచరుడు భావించారు. అయితే ఈ ఉత్తరం చేత్తో రాసిన ఉత్తరం. దీని మీద సంతకం కానీ, తేదీ కానీ లేకపోవడం గమనార్హం.
*మరొక విషయం ఏమిటంటే, ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పిన ఈ కథలో ఉన్న వారెవరు కూడా ఇప్పుడు లేరు. అందరూ చనిపోయారు. పీటర్ మున్రో గారు 2009లో మరణించారు. ఈ papyri లను పరిశీలించాడు అని చెప్పబడుతున్న మున్రో గారి సహచరుడు 2006లో మరణించారు. Hans-Ulrich Laukamp 2002 లో చనిపోయాడు. కాబట్టి, ఈ అజ్ఞాత వ్యక్తి చెప్పిన కథ, నిజమో కాదో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే Laukamp అమెరికాకు వలస వెళ్ళినప్పుడు, తనతో పాటు ఈ papyri లను తీసుకొచ్చాడు అని ఒక ఇ-మెయిల్ లో ఉంది. దాన్ని బట్టి Laukamp అమెరికాలో నివసిస్తున్నప్పుడే ఈ papyri లను ఈ అజ్ఞాత వ్యక్తికి అమ్మినట్లు తెలుస్తోంది.
*ఏరియల్ సబర్ గారు పబ్లిక్ డాక్యుమెంట్స్ అన్నీ వెతగ్గా, 1997వ సంవత్సరంలో Hans-Ulrich Laukamp దంపతులు, జర్మనీ నుండి అమెరికాలోని ఫ్లోరిడాకి వచ్చి, ఒక ఇల్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు అని తెలిసింది. అక్కడికి వెళ్లి, Laukamp గురించి విచారణ చేస్తే, ఆ దంపతులిద్దరూ chain smokers అనీ, వారు ఎక్కువగా ఒంటరిగా ఉంటూ ఉండేవారనీ, Laukamp భార్య లాండ్రీ షాప్ లో పని చేసేదనీ, Laukamp ఒక tool-maker అనీ, అతను పెద్దగా చదువుకోలేదనీ, హై స్కూల్ విద్య కూడా పూర్తి చేయలేదని తెలిసింది. ఈ విషయాలు తెలుసుకున్న ఏరియల్ సబర్ గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే, సాధారణంగా ఒక "manuscript collector" కి ఉండాల్సిన నేపథ్యం ఇది కాదు.
*ఏరియల్ సబర్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్ లో స్పష్టంగా తెలిసిన విషయాలు ఏంటంటే, వాల్టర్ ఫ్రిట్జ్ నోరు తెరిస్తే అన్ని అబద్దాలే. తానే ఒక నకిలీ papyrus ని సృష్టించి, Laukamp దగ్గర నుండి కొన్నాను అని చెబుతూ నకిలీ సేల్స్ కాంట్రాక్టును, ఇంకా పీటర్ మున్రో గారు ఇచ్చారు అని చెబుతూ కొన్ని నకిలీ ఉత్తరాలను సృష్టించాడు. మహా మాటకారి - తన మాటలతో అందరినీ ఒప్పించగలడు. నమ్మిన వారిని నట్టేటా ముంచేసే రకం. సొంత భార్యతో కలిసి సామూహిక శృంగారంలో పాల్గొంటూ వాటిని సినిమాలుగా చిత్రీకరించి అశ్లీలమైన వెబ్-సైట్లలో ప్రసారం చేసేవాడు. ఇలాంటి దరిద్రమైన వ్యక్తిత్వం ఉన్నవాడు యేసు ప్రభువు గురించి ఏదో ఒక కట్టు కథ అల్లితే, అదే నిజమని నమ్మేవాళ్ళు కూడా ఉండటం మన దౌర్భాగ్యం.
*Gospel of Jesus's Wife అనే papyrus fragment ని దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కారెన్ లీ కింగ్ సమర్ధిస్తూ వచ్చింది. కానీ ఏరియల్ సబర్ గారు ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టిన నిజాలను తెలుసుకున్నాక ఆమె కూడా ఈ fragment నకిలీది అయ్యుండొచ్చు అనే అభిప్రాయానికి వచ్చారు. ఆమె స్వయంగా ఏరియల్ సబర్ గారికి ఫోన్ చేసి, మీరు వెలికితీసిన వాస్తవాలు నిజంగా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పారు. "వాల్టర్ ఫ్రిట్జ్ తో అనేక ఇ-మెయిల్ సంభాషణలు జరిపాను. 2011 డిసెంబరులో వ్యక్తిగతంగా కూడా కలిశాను. కానీ అతను ఫ్రీ యూనివర్సిటీలో Egyptology Institute లో చదువుకున్న విషయం కానీ, తనకు కాప్టిక్ భాష వచ్చు అనే విషయం కానీ, సొంత భార్యతో కలిసి అశ్లీలమైన చిత్రాలు తీసిన విషయం కానీ... నాకు ఎప్పుడూ చెప్పలేదు. అతను నాకు అన్ని అబద్దాలే చెప్పాడు" అని కారెన్ లీ కింగ్ గుర్తు చేసుకున్నారు.
*ఏరియల్ సబర్ గారు ఇన్వెస్టిగేట్ చేసి వెలికి తీసిన ఈ విషయాలన్నిటిని "ది అట్లాంటిక్" మ్యాగజీన్ వారు ప్రచురించారు. అలాగే ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక కారెన్ లీ కింగ్ గారు ఏమని స్పందించారో కూడా ఇదే మ్యాగజీన్ లో ప్రచురితం అయ్యింది. ఒకవేళ మీరు వాటిని చదవాలి అని అనుకుంటే ఏరియల్ సబర్ గారు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పిన మొత్తం ఇన్ఫర్మేషన్ చదవాలి అని అనుకుంటే గనక Click here👇
9. ఏసుక్రీస్తు వారికి వివాహం జరిగినట్టు బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయ, యేసుతో కలసి జీవించిన వారి మాటలను పరిశిలిద్దాం.
*పరలోకపు తండ్రి యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుకు వివాహం అయ్యినట్టుగా బైబిల్లో వ్రాయబడిందా? లేదు. ముమ్మాటికి యేసుక్రీస్తు వివాహితుడు కాడు. సుమారు 40మందితో 1600సంవత్సరాల కాలములో పరిశుదాత్మ ప్రేరణతో వ్రాయించిన దేవుని గ్రంధమే ధీ బైబిల్(THE BIBLE). లూకా 24:44-లో మోషే ధర్మశాస్త్రములోను ,ప్రవక్తల గ్రంధములోను, కిర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు అంటే తన గుర్చిన విషయాలు ఒక్క బైబిల్ ఉన్నాయని యేసుక్రీస్తు వారు అంటున్నాడు.*1యోహాను 4:14- తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్షామిచ్చుచున్నాము. అని యేసుతో కలిసి జీవించిన వాళ్లు చెప్తున్నారు.
*మత్తయి 13:53లో అయన స్వదేశమునకు వచ్చి, సమాజ మందిరములో వారికీ భోదించుచుండెను. అందువలన వారు ఆర్చర్యపడి- ఈ జ్ఞానమును,ఈ అద్భుతములును ఇతనికి ఎక్కడ నుండివచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా?ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు,యేసేపు, సిమోను యూదాయను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరిమనులందరు మనతోనేయున్నారు కారా? క్రీస్తు కుటుంబము ఎవరో వారి గూర్చి పై వచనములో చెప్పబడింది. ఒక వేళ యేసుకు మగ్దలేనే మరియతో వివాహం జరిగి ఉంటే ఇతని భార్య మగ్దలేనే మరియ కాదా అను మాట ప్రస్తావించబడేది కానీ లేదు. సమాజములో ఆయనంటే పడని వారు చెబుతున్న మాటలను మత్తయి వ్రాసాడు.
10. . మగ్దలేనే మరియ ఎవరు? యేసుతో ఆమెకు ఏటువంటి సంభంధం ఉంది అను ప్రశ్నలకు బైబిల్ ఏమి చెబుతుందో తన గురంచి కొన్ని మాటలు చూద్దాము.
*మగ్దలేనే మరియ అనగానే యేసుతో పాటు ఉన్న స్త్రీలలో భక్తి గలిగిన స్త్రీగా క్రైస్తవ సమాజానికి తెలుసు కానీ మిగిలిన లోకపు వారికీ మగ్దలేనే మరియ అనగానే యేసుకు భార్య అని మాట్లాడుకోవడం విచారకరం. లూకా 8:1 నుండి చూస్తే యేసు పరిచర్యలో మగ్దలేనే మరియ కొనసాగినట్టుగా కనబడుతుంది. లూకా 8:1,2,3లో ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు అని ప్రస్తావించబడింది. యేసును తెలుసుకోననప్పుడు ఏడు దయ్యములు పట్టినట్టుగా మనకు తెలుస్తుంది. యేసు ద్వారా తన బ్రతుకును దయ్యముల బారి నుండి బయటకు వచ్చి జీవితమును మార్చుకుంది. అప్పటి నుండి యేసును వెంబడించింది.*యోహాను 19:27- అయన తల్లియు, అయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యెద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి- అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యున్ని చూచి-ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఒకవేళ యేసు మగ్దలేనే మరియను వివాహం చేసుకుని ఉంటే ఇదిగో నా భార్యను జాగ్రత్తగా చూసుకోండి అని యేసు వారికీ చెప్పేవాడు కదా.
*మగ్దలేనే మరియను తన భార్యగా యేసుక్రీస్తు ఎక్కడ చెప్పలేదు. యేసు పరిచర్యలో ఒక స్త్రీగా ఉంది. యోహాను 20:16- ఆమె అయన వైపు తిరిగి హెబ్రీ భాషలో రాబ్బుని(భోదకుడా) అని పలికెను. ఒక వేళ యేసుతో వివాహం అయ్యి ఉంటె రబ్బుని అనే మాట కాక భర్త అని అనేది.కానీ అలా చెప్పలేదు.
*ఒక వేళ యేసు ఆమెను వివాహం చేసుకుని ఉంటే బైబిల్లో ఆమె పేరు క్రీస్తుకు భార్యయైన మరియ అని ఉంటుంది కానీమగ్దలేనే మరియ అని చెప్పబడదు
*బైబిల్ అంతటిలో మనం పరిశిలిస్తే యేసు ఒక్కటిగానే ఉన్నాడని లేఖనాలు చెబుతుంది. యేసుకు భార్య ఉన్నదని new Tastementలో కూడా ఎక్కడ లేదు. కనుక యేసు వివాహితుడు కాదు &కల్పిత పుస్తకమును రచించిన వారి మాటలు అబద్దమే.
*ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల వచనాలు యేసుకు వివాహం కానట్టుగా, ఒక పరిశుద్దుడుగా కనబడుతుంది. దానికి సంబంధించి చారిత్రాత్మకంగా లేదా బైబిలు ప్రకారం ఎటువంటి ఆధారాలు లేవు.
*బైబిల్లోని new Tastementలో ఉన్నవాళ్ళు యేసుతో కలసి తిరిగిన వాళ్ళగా,కలసి భోజనం తిన్నవాళ్ళుగా, కలిసి పరిచర్య చేసేనవాళ్ళుగా, అయన అడుగు జాడలలో నడిచేవారన్న విషయము మనకు తెలుసు. వీళ్ళు వ్రాసిన మాటలే బైబిల్లో ఉంటాయి.అనగావాళ్ళ కళ్ళతో చూసిన దృశ్యాలను, వినిన మాటలను బైబిల్లో వ్రాసారు. అయితే యేసుపునరుర్ధానమైన ఐదు వందల సంవత్సరాల తర్వాత దొరికిన ముక్కను చూసిన మాటలనువీరు ఉహించి, కల్పించి ధీ లాస్ట్ గాస్పెల్ అనే పుస్తకమును వ్రాసారు. ప్రజా కోర్టులో మన కళ్ళతో చూచిన సాక్షాలే చెల్లుతాయని, చూడని వాడి సాక్షం చెప్తే చెల్లదన్న విషయము మనకు తెలుసు. మరి చూడని వాడి సాక్షం చెప్తే చెల్లనప్పుడు మరి యేసును చూడని వాని సాక్షం చెప్తే ఎలా చెల్లుతుంది?చెల్లదు.
*ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మత్తయి మాటలను నమ్మాలా లేక ఇప్పుడు వచ్చిన వాడు అంటున్న మాటలు నమ్మాలా అన్నది మిరే ఆలోచించండి. మత్తయి 13:53లోవివాహం గూర్చి కానీ, పిల్లలు గూర్చి కానీ చెప్పబడలేదు. అనగా బైబిల్లో యేసుతో జీవించిన ఏ ఒక్కరు కూడ భార్య, పిల్లల ప్రస్తావన చెప్పలేదు,వ్రాయలేదు.. మేమును, పరిశుదాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని అపోకర్య 5:32 చెప్తున్నారు
* యేసుతో జీవించిన వారి మాటల సాక్ష్యంలో ఎక్కడను కూడ వివాహము గూర్చి ప్రస్తావన జరగలేదు. ఇంత క్లియర్ గా బైబిల్ లో వ్రాసి ఉండగా యేసు పునరుర్ధానము అయ్యి కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు వివాహితుడు అని కల్పించి ఉహించి వ్రాసిన పుస్తకము బట్టి ఏసు వివాహితుడని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ .
----------------------------------------------------------------------------------------------------------------------------
click here -https://amzn.to/3WGmdXa
-----------------------------------------------------------------------------------------------------------------------------
*మగ్దలేనా మరియతో యేసు క్రీస్తు వివాహం అయినట్లుగా ఆధారాలు సృష్టించాలని The Da Vinci Code , లాస్ట్గాస్పల్, ద గాస్పల్ ఆఫ్ జీసస్ వైఫ్ లాంటివి తీసుకొచ్చి ఆయన మీద బురద జల్లాలని చూసినప్పటికీ దీనికి ఖచ్చితమైన చారిత్రక, లేదా సాంప్రదాయ ఆధారాలతో నిరూపించబడలేదు
మొత్తంగా చెప్పాలంటే, యేసు క్రీస్తు వివాహం అయినట్లుగా చరిత్ర లేదా బైబిలు ప్రామాణికంగా ఎలాంటి ఆధారాలు లేవు... లాస్ట్గాస్పెల్- ఒక వేస్ట్ గాస్పెల్ గా మిగిలిపోయింది.
*ఒక వేళ క్రీస్తు అవమానపరచబడుతున్నాడు అంటే కారణము మనమే. ఎందుకంటే ఈ విషయాన్ని మనకే తెలియదు వాళ్ళకి ఎలా చెప్తాం. ఎవరో ఇలాంటి పుకార్లు పుట్టీయగానే వాటిని నమ్ముతాం అవి నిజమా కాదని తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యం. దేవుని గురించి ఇంకా తెలుసుకుని క్రీస్తు గూర్చి తప్పుడుగా ఎవడు మాట్లాడుతాడో వారికి ఆన్సర్ చేసే వాళ్ళుగా మనం ఉండాలి
*దేవుడు లేడనే వాడు, బైబిల్ తప్పు అని మాట్లాడుతున్న వాడు, యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడని అనేవాడు, యేసుక్రీస్తుకు మగ్దలేనె మరియకు అక్రమ సంభందాన్ని అంతకట్టుతున్న వీళ్ళు మూర్ఖులు.
*యేసుక్రీస్తుముందు, యేసుక్రీస్తువెనుక ఎందరో చక్రవర్తులు, మేధావులు పుట్టిన ఏ ఒక్కడిని శక పురుషుడు అని అనక కేవలం ఒక్క యేసుక్రీస్తును శకపురుషుడిగా,యుగపురుషుడిగాపిలువబడ్డాడు
*కనుక ఇలాంటి తప్పుడు వార్తలు ఎన్ని వచ్చిన చెల్లని నోటు కాగితాలు అని ప్రకన్న తిసి పారేయండి. రేపు ఎవరైనా ఇలాంటి వార్తలు తీసుకునివచ్చి మీ యేసుకు పెళ్లి అయ్యింది కదా అని అంటే వారికి ఆన్సర్ చేసే వారిగా మీరు ఉండాలి ఇలాంటి మాటలకి మీరు బలహీన పడకండి బలహీన పడే వారికి ఈ వీడియోని షేర్ చేసి బలపరచండి... మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి
Subscribe to my youtube chnnel; www.youtube.com/@biblesecretstelugu
దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్..
0 Comments